Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి..ఎప్పటి నుంచి అంటే..!

చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి..ఎప్పటి నుంచి అంటే..!

Fish Prasadam: శ్వాస సంబంధి వ్యాధులతో బాధపడే వారు చేప ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. ఏటా మృగశిర కార్తె సమయంలో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలానే ఈ ఏటాది కూడా ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

Fish Prasadam: శ్వాస సంబంధి వ్యాధులతో బాధపడే వారు చేప ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. ఏటా మృగశిర కార్తె సమయంలో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలానే ఈ ఏటాది కూడా ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

చేప ప్రసాదం వితరణ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు ఈ చేప ప్రసాదం అందిస్తుంటారు. ఏటా మృగశిర కార్తెక  సందర్బంగా ఈ ప్రసాద వితరణ జరుగుతుంటుంది. ఈ ప్రసాద పంపిణీ ఎప్పుడు జరుగుతుందా అని అందరు ఎదురు చూస్తుంటారు. బత్తిని కుటుంబ సభ్యులు ఈ చేప ప్రసాద వితరణ చేస్తుంటారు. ఏటా మాదిరిగానే ఈ సారి కూడా మృగశిర కార్తెక సందర్భంగా ప్రసాద పంపిణీకి బత్తిని ఫ్యామిలీ సభ్యులు సిద్ధమయ్యారు. మరి…దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

శ్వాస సంబంధి వ్యాధులతో బాధపడే వారు చేప ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. ఏటా మృగశిర కార్తె సమయంలో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలానే ఈ ఏటాది కూడా ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ మైదానంలో ఈ  ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఇక ఈ  కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా నిర్వహకులు వివరించారు. మృగశిర కార్తె జూన్ 8 వ తేదీన శనివారం ఉదయం 11 గంటలకు ప్రవేశిస్తుంది. ఆ సమయం నుంచే చేప మందును పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.

జూన్ 8 ఉదయం 11 గంటల నుంచి జూన్ 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌‌లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. చేప ప్రసాదాన్ని భక్తులకు పూర్తి ఉచితంగా అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.  ఇక చేప ప్రసాదం కోసం వచ్చే వారి సౌకర్యార్థం.. పలు ఫౌండేషన్ల సహకారంతో.. 24 గంటల పాటు మెడికల్ సర్వీస్, భోజన సౌకర్యం, మంచి నీటి సరఫరా వంటివి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. చేప ప్రసాదం పంపిణీకి గత ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేసిన విధంగానే.. ఈ ప్రభుత్వాన్ని కూడా తగిన ఏర్పాట్లు చేయాలని కోరామని, తమ విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూలం స్పందించిందని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రంల్లోని వివిధ ప్రాంతాలతో పాటు, ఇతర రాష్ట్రాలనుంచి కూడా ఈ ప్రసాదం కోసం వస్తుంటారు. ఈసారి కూడా భారీ సంఖ్యలో శ్వాస కోస సంబంధిత బాధితులు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

ఇక ఈ చేప ప్రసాదం వితరణ గురించి చూసినట్లు అయితే ఏటా మృగశిర కార్తె రోజున హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో బత్తిని ఫ్యామిలీ సభ్యులు చేప ప్రసాందాన్ని పంపిణీ చేస్తుంటారు. 1847లో హైదరాబాద్‌ లో ఈ ప్రసాదం పంపిణీ ప్రారంభమైందని చెబుతుంటారు. అప్పట్లో వీరన్న గౌడ్ అనే వ్యక్తి ప్రతి మృగశిర కార్తె ముందు రోజు నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారంట. ఆయన తర్వాత వారి వారసుడు బత్తిని శివరామ గౌడ్, అతని కుమారుడు బత్తిని శంకర్‌గౌడ్ ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అలా కొన్నేళ్ల నుంచి వారి ఫ్యామిలీ చేప ప్రసాద పంపిణీ చేస్తుంది. మధ్యలో కోవిడ్‌ కారణంగా చేప ప్రసాదం పంపిణీ రెండేళ్ల పాటు నిలిచిపోయింది. అనంతరం గతేడాది నుంచి చేప ప్రసాద పంపిణీకి తిరిగి ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తుంది.

Show comments