Keerthi
హైదరాబాద్ బిర్యానీ అంటే దేశవ్యాప్తంగా చాలామంది ఇష్టపడతారు. ఈ క్రమంలోనే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ బిర్యానీ అంటే పడి చస్తారు. మరి ఎంతో రుచికరమైన ఘుమఘుమలాడే బిర్యానీ విక్రయించే ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకి ఎక్కడంటే..
హైదరాబాద్ బిర్యానీ అంటే దేశవ్యాప్తంగా చాలామంది ఇష్టపడతారు. ఈ క్రమంలోనే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ బిర్యానీ అంటే పడి చస్తారు. మరి ఎంతో రుచికరమైన ఘుమఘుమలాడే బిర్యానీ విక్రయించే ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకి ఎక్కడంటే..
Keerthi
బిర్యానీ.. దీన్ని ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ బిర్యానీ అంటే పడి చస్తారు. దేశవ్యాప్తంగా చాలామంది బిర్యానీ లవర్స్ ఉన్నారు. అందులో ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ అంటే లొట్టలేసుకుని మరీ ఆరగిస్తారు. అంతలా ఈ హైదరాబాద్ బిర్యానీ ఘుమఘుమలు ప్రపంచం నలుమూలలా విస్తరించాయి. ఎంతోమంది సెలబ్రిటీస్ సైతం హైదరాబాద్ వస్తే బిర్యానీ టేస్ట్ చేయనిదే వెనుతిరగరు. అంతలా నోరూరించే ఈ హైదరాబాద్ బిర్యానీ ఇప్పుడు అన్ని చోట్లా లభిస్తోంది. దీనికోసం చాలామంది పగలు, రాత్రి తేడా లేకుండా పడిగాపులు కాస్తారు. అయితే ఈ బిర్యానీ ప్రాంతం బట్టి, రుచి ధర మారిపోతుందనే విషయం తెలిసిందే.
మామూలుగా సింగిల్ బిర్యానీ అంటే కనీసం ఓ వందైనా ఉంటుంది. వెజ్ బిర్యానీ కూడా వంద రూపాయల పైనే ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే చోట మాత్రం కేవలం 10 రూపాయలకే నోరూరించే బిర్యానీని అందిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే ష్టేషన్ పక్కన ఉండే ఆక్సా హోటల్ లో 10 రూపాయలకే వెజ్ బిర్యానీని వడ్డిస్తున్నారు. అసలు ఈ 10 రూపాయలకి వెజ్ మీల్సే వడ్డించరు. అలాంటిది ఆక్సా హోటల్ వారు మాత్రం 10 రూపాయలకే టేస్టీ వెజ్ బిర్యానీ విక్రయిస్తున్నారు. అయితే ఈ బిర్యానీతో వారికి కేవలం ఒక్క రూపాయి మాత్రమే మిగులుతుందట. అది కూడా మెయింటెన్స్, ఇతర ఖర్చుల కోసం సరిపోతుందట. కేవలం సొసైటీకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా 10 రూపాయలకు బిర్యానీ అందిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
ఇది లాభాలను ఆర్జించడం కోసం విక్రయించడం లేదని, పేదవారి కడుపు నింపే ప్రయత్నం కోసం చేస్తున్నామని హోటల్ వారు తెలిపారు. ఈ బిర్యానీ అచ్చం ఇళ్లలో చేసుకునే విధంగా చాలా టేస్టీగా ఉందని ఇక్కడ తిన్న వాళ్ళు చెబుతున్నారు. దీనిలో ఆలు, టమాట, క్యాప్సికం, బఠాణి.. ఇలా అన్నీ వేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఈ బిర్యానీ సెంటర్ రన్ చేస్తున్నామని తెలిపారు. అలాగే ఈ బిర్యానీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అందుబాటులో లభిస్తుందని పేర్కొన్నారు. కాగా, ఇక్కడ తినే సదుపాయమే కాకుండా పార్శిల్ సౌకర్యం కూడా ఉంది. ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా ఓసారి స్టేషన్ రోడ్డుకి వెళ్లి బిర్యానీ టేస్ట్ చేసేయండి. మరి లాభం లేకపోయినా 10 రూపాయలకు బిర్యానీ విక్రయిస్తుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.