iPhone 14: పాత iPhone ఇస్తే.. రూ.8,249కే కొత్త iPhone 14.. కానీ..!

యాపిల్‌ ఐఫోన్‌ 14 కొనాలనుకునే వారికి మంచి చాన్స్‌. దీనిపై భారీ ఎత్తున​ డిస్కౌంట్స్‌, ఎక్స్‌చెంజ్‌ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు..

యాపిల్‌ ఐఫోన్‌ 14 కొనాలనుకునే వారికి మంచి చాన్స్‌. దీనిపై భారీ ఎత్తున​ డిస్కౌంట్స్‌, ఎక్స్‌చెంజ్‌ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు..

చాలామందికి యాపిల్‌ ఉత్పత్తులు అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఐఫోన్‌ కొనాలని చాలా మంది భావిస్తారు. కానీ దాని ధర ఎంతో ఎక్కువ. అందుకే ఆఫర్లు ఉన్న సమయంలో యాపిల్‌ ఐఫోన్‌ కొంటుంటారు. ఒకవేళ మీరు కూడా అదే ఆలోచనలో ఉంటే.. ఐఫోన్‌ కొనాలనుకుంటే.. ఇదే మంచి సమయం. కేవలం 8,249 రూపాయలకే కొత్త ఐఫోన్‌ కొనుగోలు చేయవచ్చు. ఇంత భారీ ఆఫర్‌ ఏంటి అంటే.. ఎక్స్‌చేంజ్‌ ఆఫర్‌ కింద పాత మొబైల్‌ని ఇచ్చి.. కొత్త ఐఫోన్‌ని కేవలం 8249 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. భారీ ఎత్తున డిస్కౌంట్‌ కూడా ఉంది. ఇంతకు ఈ ఆఫర్‌ ఎక్కడ అందుబాటులో ఉంది.. ఎలా కొనాలి అంటే..

ఈ ఆఫర్‌ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. గత కొన్ని నెలలుగా ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధికంగా అమ్ముడైన యాపిల్‌ ఐఫోన్‌ మోడల్స్‌లో 14 ఒకటి . ప్రస్తుతం ఇది భారీ తగ్గింపు ధరతో ఈకామర్స్‌ స్టోర్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా.. యాపిల్‌ ఐఫోన్‌ పై రూ. 48,750 ఆఫర్‌, డిస్కౌంట్‌ తర్వాత కేవలం రూ.8,249కే అందుబాటులో ఉంది.

యాపిల్‌ ప్రతి ఏటా ఐఫోన్‌ కొత్త సిరీస్‌లను రిలీజ్‌ చేస్తుంటుంది. దీనిలో భాగంగా గతేడాది యాపిల్‌ ఐఫోన్‌ 14 ప్రో అండ్‌ ప్లస్‌ మోడల్స్‌ రిలీజ్‌ అయ్యాయి. 79,900 రూపాయల ప్రారంభ ధరతో వీటిని లాంచ్‌ చేశారు. ఇక యాపిల్‌ ఐఫోన్‌ 15 సిరీస్ లాంచ్ అయిన తర్వాత 14 సిరీస్‌ ధర రూ.10,000 వరకు తగ్గింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్‌ ఐఫోన్‌ 14 రూ. 56,999కి అందుబాటులో ఉంది.

అధికారిక స్టోర్ ధర మీద ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా రూ. 12,901 తగ్గింది. దాంతో ప్రస్తుతం యాపిల్‌ 14 రేటు ఫ్లిప్‌కార్ట్‌లో 56,249 రూపాయలకు చేరింది. అంతేకాకుండా పాత ఐ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఎక్స్చేంజ్ ఆఫర్‌ ప్రకటించింది. ఓల్డ్‌ ఫోన్‌ మీద ఏకంగా రూ.48,000 వరకు ఎక్స్‌చెంజ్‌ ఆఫర్‌ను అందిస్తోంది. అన్ని ఆఫర్లు ఇంకా తగ్గింపుల తర్వాత ఆపిల్ ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ. 8,249కి పొందవచ్చు.

యాపిల్‌ ఐఫోన్‌ 14 ఫీచర్స్‌ విషయానికి వస్తే.. ఇది కూడా ఐఫోన్‌ 13లో ఉన్న చిప్‌సెట్‌తోనే వస్తుంది. 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేతో ముందు భాగంలో ఐఫోన్‌ 13 వంటి నాచ్‌తో ఉంటుంది. వీడియో కాల్స్ ఇంకా సెల్ఫీల కోసం 12ఎంపీ కెమెరా ఉంది. అయితే ఐఫోన్‌ 13, 14 రెండింటి మధ్య చాలా ఫీచర్స్‌ కామన్‌గా ఉండటంతో.. ఐఫోన్‌ 14 సిరీస్‌ అనుకున్నంతగా సక్సెస్‌ కాలేదు. ఇక ఈకామర్స్‌ స్టోర్స్‌లో డిస్కౌంట్‌ ఆఫర్‌ ప్రకటించిన తర్వాత సేల్స్‌ ఊపందుకున్నాయి.

Show comments