Nidhan
ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు బ్యాడ్ న్యూస్. వెటరన్ పేసర్ మహ్మద్ షమి రూపంలో టీమ్‌కు భారీ షాక్ తగిలింది.
ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు బ్యాడ్ న్యూస్. వెటరన్ పేసర్ మహ్మద్ షమి రూపంలో టీమ్‌కు భారీ షాక్ తగిలింది.
Nidhan
వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్లో భారత జట్టు ఓడిపోవడంతో అభిమానులు, ప్రేక్షకులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటకు వస్తున్నారు. ఆటగాళ్లు కూడా ఫైనల్ ఓటమి మిగిల్చిన పెయిన్ నుంచి తేరుకొని మిగిలిన సిరీస్‌లపై ఫోకస్ పెడుతున్నారు. అయితే ఇదే ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచ కప్-2024 జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో పొట్టి కప్‌ను రోహిత్ సేన గెలుచుకోవాలని కోరుకుంటున్నారు. ఈ తరుణంలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. వెటరన్ పేసర్ మహ్మద్ షమి టీ20 ప్రపంచ కప్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. గాయంతో బాధపడుతున్న షమి ఇంకా కోలుకోలేదని.. ఐపీఎల్-2024తో పాటు పొట్టి ప్రపంచ కప్‌కు అతడు అందుబాటులో ఉండడని షా చెప్పారు.
షమి గాయం, సర్జరీతో పాటు అతడి కమ్‌బ్యాక్‌పై జై షా పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆపరేషన్ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న షమీని ఆయన కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘షమీకి సర్జరీ పూర్తయింది. ఆపరేషన్ తర్వాత అతడు భారత్‌కు తిరిగి వచ్చేశాడు. ఈ ఏడాది ఆఖర్లో బంగ్లాదేశ్‌తో జరిగే హోమ్ సిరీస్‌తో అతడు కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది’ అని షా తెలిపారు. స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇంజ్యురీ మీదా ఆయన రియాక్ట్ అయ్యారు. రాహుల్ ఇంకో ఇంజక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని.. అతడు ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్‌లో ఉన్నాడని చెప్పుకొచ్చారు.
షమి, రాహుల్‌తో పాటు స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీఎంట్రీ మీద కూడా షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంత్ రికవర్ అయ్యాడని.. ప్రస్తుతం అతడు బ్యాటింగ్ సాధన చేస్తున్నాడని తెలిపారు. అతడు ఫిట్‌గా ఉన్నాడని త్వరలో డిక్లేర్ చేస్తామని చెప్పుకొచ్చారు. భారత క్రికెట్‌కు పంత్ గొప్ప ఆస్తి లాంటి వాడని.. అతడ్ని కాపాడుకోవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు షా. అతడు పూర్తి ఫిట్నెస్ సాధించి తిరిగి ఫామ్‌ను అందుకుంటే టీ20 వరల్డ్ కప్‌లో ఆడటం ఖాయం అని స్పష్టం చేశారు. ఐపీఎల్-2024లో పంత్ ఎలా ఆడతాడో చూడాలని ఉందని షా వ్యాఖ్యానించారు.
కాగా, వన్డే ప్రపంచ కప్ టైమ్‌లో గాయపడిన షమి.. ఎన్సీఏలో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. కానీ గాయం మానకపోవడంతో రీసెంట్గా సర్జరీ చేయించుకున్నాడు. అతడు పూర్తిగా రికవర్ అయి కమ్‌బ్యాక్ ఇవ్వాలంటే ఇంకో ఆరేడు నెలలు పట్టేలా ఉందని జై షా తెలిపారు. షమి దూరమవడంతో టీ20 వరల్డ్ కప్‌కు ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లే. ఎంతో అనుభవం, అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యం, భీకర ఫామ్‌లో ఉన్న అలాంటోడ్ని భర్తీ చేయడం అంత ఈజీ కాదు. ఈ లోటును టీమ్ మేనేజ్మెంట్, సెలక్టర్లు ఎలా పూరిస్తారో చూడాలి. మరి.. టీ20 వరల్డ్ కప్‌కు షమి దూరమవడం మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: IPL 2024.. కష్టాల్లో ఉన్న గుజరాత్ కు గుడ్ న్యూస్! స్టార్ ప్లేయర్ వస్తున్నాడు
🚨Mohammed Shami ruled out of IPL 2024 and T20 World Cup 2024.#IPL2024 #T20WorldCup2024 #GujaratTitans #TeamIndia #CricketTwitter pic.twitter.com/uRmuWIbLSD
— InsideSport (@InsideSportIND) March 11, 2024