Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ భయం ఉన్నవాళ్లు ఆడటం మానేయాలని అన్నాడు. అసలు హిట్‌మ్యాన్ ఎవర్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ భయం ఉన్నవాళ్లు ఆడటం మానేయాలని అన్నాడు. అసలు హిట్‌మ్యాన్ ఎవర్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు చూద్దాం..
Nidhan
ఆఫ్ఘానిస్థాన్‌తో టీ20 సిరీస్ విజయంతో భారత జట్టు ఫుల్ జోష్‌లో ఉంది. గతేడాది మొత్తం వన్డే వరల్డ్ కప్ ప్రిపరేషన్స్‌లో బిజీ అయిపోయింది టీమిండియా. దీంతో ఈ ఏడాది జూన్‌లో ఆడబోయే టీ20 ప్రపంచ కప్‌కు సన్నద్ధమయ్యేందుకు అంత టైమ్ దొరకలేదు. స్వదేశంతో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్, ఆ తర్వాత సౌతాఫ్రికా, ఆఫ్ఘానిస్థాన్లతో పొట్టి ఫార్మాట్లలో పలు మ్యాచులు ఆడింది. కానీ టాప్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఒక్క ఆఫ్ఘాన్ సిరీస్‌లోనే ఆడారు. వీళ్లతో పాటు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లాంటి కీలక ఆటగాళ్లు మిగిలిన సిరీస్‌ల్లో ఆడలేదు. దీంతో టీ20 వరల్డ్ కప్‌కు వెళ్లబోయే జట్టు ఎంపిక విషయంలో పూర్తి అవగాహన రాలేదు. ఆఫ్ఘాన్ సిరీస్‌లో చేసిన కొన్ని ప్రయోగాలతో దీనిపై కొంత క్లారిటీ ఇచ్చింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం టీమ్ ఇంకా ఖరారు కాలేదన్నాడు. అదే సమయంలో కొందరికి వార్నింగ్ ఇచ్చాడు. ఆ భయం ఉండే ఆటగాళ్లు ఆడటం మానేయాలని అన్నాడు.
టీ20 క్రికెట్లో పరుగులు చేయాలనే కసి ఉండాలని.. దూకుడు మంత్రాన్ని ఉపయోగించాలన్నాడు రోహిత్. ఔట్ అవుతాననే భయం ఉంటే టీ20 క్రికెట్‌కు దూరంగా ఉండాలన్నాడు. ఆఫ్ఘాన్‌తో చివరి టీ20లో విరాట్ కోహ్లీ, సంజూ శాంసన్ దూకుడుగా రన్స్ చేయాలనే ఉద్దేశంతో ఆడి ఔట్ అయ్యారని రోహిత్ పేర్కొన్నాడు. అలా ఔట్ అయినప్పటికీ వాళ్లిద్దరి ఆలోచన మాత్రం సరైనదేనని వ్యాఖ్యానించాడు. ఔట్ అవుతాననే భయం ఉంటే పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించాడు. దీంతో అసలు రోహిత్ ఎవర్ని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశాడా? అని అందరూ ఆలోచనల్లో మునిగిపోయారు. అయితే టీమ్‌లో ఎవరూ నిదానంగా ఆడొద్దని.. ఈ ఫార్మాట్‌కు తగ్గట్లు అటాకింగ్ ఫార్ములాతో ముందుకెళ్లాలని స్పష్టం చేసే క్రమంలోనే అతడు ఇలా మాట్లాడి ఉండొచ్చని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. స్లోగా ఆడటం వల్ల టీమ్‌కు నష్టం తప్ప ఒరిగేదేమీ లేదనే ఉద్దేశంతోనే అతడు ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని చెబుతున్నారు.
కాగా, టీ20 వరల్డ్ కప్‌కు వెళ్లే భారత స్క్వాడ్ మీద కూడా హిట్‌మ్యాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పొట్టి ఫార్మాట్లో జరిగే ప్రపంచ కప్‌లో ఆడే 8 నుంచి 10 మంది ఆటగాళ్లు ఎవరనేది తనకు తెలుసునని చెప్పాడు రోహిత్. ‘టీ20ల్లో చాలా మంది యంగ్‌స్టర్స్‌ను పరిశీలించి చూస్తున్నాం. కానీ మెయిన్ టీమ్‌ను సెలక్ట్ చేసినప్పుడు వీళ్లలో కొందర్ని తప్పించాల్సి ఉంటుంది. అది వాళ్లకు నిరాశ కలిగిస్తుందని తెలుసు. కానీ టీమ్‌లో ఒక క్లారిటీ రావడం కోసం ఇలా చేయక తప్పదు. 25 నుంచి 30 మంది ప్లేయర్ల పూల్ నుంచి మేం వరల్డ్ కప్ టీమ్‌ను సెలక్ట్ చేయాలి. అయితే మేం ఇంకా జట్టును ఖరారు చేయలేదు. కానీ మెగాటోర్నీలో ఆడబోయే ఎనిమిది నుంచి పది మంది ఆటగాళ్లు మా మైండ్‌లో ఉన్నారు’ అని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు. అయితే వరల్డ్ కప్ గురించి మాట్లాడినప్పటికీ.. భయం ఉన్న ప్లేయర్లు ఈ ఫార్మాట్లో ఆడటం మానేయాలని రోహిత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరి.. హిట్‌మ్యాన్ ఎవర్ని టార్గెట్ చేసుకొని ఈ వ్యాఖ్యలు చేశాడని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
Do you agree with Rohit Sharma? 👀#Cricket #INDvAFG #RohitSharma pic.twitter.com/2AqpE6bbYO
— Sportskeeda (@Sportskeeda) January 19, 2024