Nidhan
టీ20 వరల్డ్ కప్-2024లో సూపర్ పోరుకు సిద్ధమవుతున్న భారత్‌లో కొత్త టెన్షన్ మొదలైంది. గెలవడం కంటే జట్టుకు ఇదే బిగ్ టాస్క్ కానుంది. దీన్ని రోహిత్ సేన ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
టీ20 వరల్డ్ కప్-2024లో సూపర్ పోరుకు సిద్ధమవుతున్న భారత్‌లో కొత్త టెన్షన్ మొదలైంది. గెలవడం కంటే జట్టుకు ఇదే బిగ్ టాస్క్ కానుంది. దీన్ని రోహిత్ సేన ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
Nidhan
టీ20 ప్రపంచ కప్ గ్రూప్ దశలో వరుస విజయాలతో దుమ్మురేపిన భారత్.. ఇప్పుడు అసలు సిసలు సవాల్‌కు సిద్ధమవుతోంది. సూపర్-8కు రెడీ అవుతోంది మెన్ ఇన్ బ్లూ. లీగ్ స్టేజ్‌లో అమెరికాలోని ట్రిక్కీ పిచ్‌లపై బౌలర్లు ఫెయిలైనా ఎలాగోలా నెట్టుకొచ్చింది రోహిత్ సేన. జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ యూనిట్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడంతో టీమిండియాకు ఎదురులేకుండా పోయింది. బౌలర్లు కూడా ఫెయిలైతే జట్టు పరిస్థితి దారుణంగా ఉండేది. త్వరలో సూపర్-8 మ్యాచ్‌లు మొదలవనున్నాయి. ఆఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి డేంజరస్ టీమ్స్‌ను ఎదుర్కోనుంది భారత్. ఆ టీమ్స్‌ను ఓడిస్తేనే సెమీస్ బెర్త్ దక్కుతుంది. దీంతో ఇక మీదట జరిగే ప్రతి మ్యాచ్ చావోరేవో కానుంది.
సూపర్-8 కోసం టీమిండియా ఆటగాళ్లు జోరుగా సాధన చేస్తున్నారు. నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఫెయిలైన టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గంటల కొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో అతడి సాధన సాగింది. తన బలహీనతల్ని దాటేందుకు అతడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. లీగ్ స్టేజ్‌లో అంతగా ఆకట్టుకోని కెప్టెన్ రోహిత్ కూడా నెట్స్‌లో చెమటోడ్చాడు. రోకో జోడీ శ్రమించడం చూస్తుంటే రన్స్ చేయాలని ఎంత కసిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలో టీమిండియాలో కొత్త టెన్షన్ మొదలైంది. సూపర్-8 మ్యాచుల్లో నెగ్గడం కంటే ఈ సవాల్‌ను దాటడం భారత్‌కు బిగ్ టాస్క్‌గా మారనుంది. సూపర్ పోరులో భాగంగా రోహిత్ సేన 5 రోజుల వ్యవధిలో మూడు నగరాల్లో మూడు మ్యాచ్‌లు ఆడనుంది.
టీమిండియా ఆడే సూపర్-8 మ్యాచులన్నీ కరీబియన్ దీవుల్లోనే జరగనున్నాయి. అయితే మూడు మ్యాచులకు మూడు వేర్వేరు నగరాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఆఫ్ఘానిస్థాన్‌తో ఆడే తొలి సూపర్ పోరుకు బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవర్ స్టేడియం హోస్ట్‌గా ఉండనుంది. బంగ్లాదేశ్‌తో జరిగే రెండో మ్యాచ్‌కు ఆంటిగ్వా సిటీలోని సర్ వీవీఎన్ రిచర్డ్స్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక, సూపర్-8 స్టేజ్‌లో ఆఖరి మ్యాచ్‌లో భాగంగా సెయింట్ లూసియా నగరంలోని డారెన్ సామి క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో తాడోపేడో తేల్చుకోనుంది టీమిండియా. అయితే ఈ మూడు సిటీల మధ్య దూరం ఎక్కువ. ఐద్రోజుల వ్యవధిలో మూడు నగరాల్లో పర్యటించి హైటెన్షన్ మ్యాచ్‌లు ఆడటం అంటే మామూలు విషయం కాదు. జర్నీ వల్ల ప్లేయర్లు అలసిపోతారు. ప్రయాణ బడలికను దాటి పెర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఇదే విషయంపై తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్ట్ అయ్యాడు. ఎక్కువగా ప్రయాణించడం వల్ల అలసిపోతామని.. అయితే దాన్ని సాకుగా చూపబోమన్నాడు. గెలవడం కోసం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతామన్నాడు.
ఇదీ చదవండి: సూపర్-8 కోసం టీమిండియా స్పెషల్ ప్లాన్.. రివీల్ చేసిన జడేజా!