Nidhan
టీమిండియా ఫ్యాన్స్ చిరకాల కోరిక నెరవేరింది. 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచ కప్ భారత్ ఒడిలో చేరింది. మెగాఫైనల్లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన రోహిత్ సేన కప్పు కలను నిజం చేసింది.
టీమిండియా ఫ్యాన్స్ చిరకాల కోరిక నెరవేరింది. 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచ కప్ భారత్ ఒడిలో చేరింది. మెగాఫైనల్లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన రోహిత్ సేన కప్పు కలను నిజం చేసింది.
Nidhan
టీమిండియా ఫ్యాన్స్ చిరకాల కోరిక నెరవేరింది. 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచ కప్ భారత్ ఒడిలో చేరింది. మెగాఫైనల్లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన రోహిత్ సేన కప్పు కలను నిజం చేసింది. ఒక దశలో మ్యాచ్ చేజారినట్లే కనిపించింది. 30 బంతుల్లో 30 పరుగులు చేస్తే ప్రొటీస్ నెగ్గేది. క్రీజులో క్లాసెన్, మిల్లర్ లాంటి డేంజరస్ బ్యాటర్లు ఉన్నారు. దీంతో ఆ జట్టుదే కప్పు అని అంతా డిసైడ్ అయ్యారు. కొందరు భారత అభిమానులు కోపంతో టీవీలు ఆపేశారు. ఆ తర్వాత అద్భుతం చోటుచేసుకుంది. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్ సూపర్బ్ బౌలింగ్‌తో సఫారీల ఆట కట్టించారు. క్లాసెన్, మిల్లర్‌ను ఔట్ చేసి మ్యాచ్‌ను భారత్ వైపునకు తిప్పారు. చివరికి 7 పరుగుల తేడాతో గెలిచింది రోహిత్ సేన.
13 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ గెలవడం, టీ20 ఫార్మాట్లో 17 ఏళ్ల తర్వాత ఛాంపియన్‌గా నిలవడంతో భారత అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. జట్టు విజయాన్ని గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. స్వీట్లు పంచుతూ, క్రాకర్స్ కాలుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారత్ విజయంతో మాజీ క్రికెటర్లు కూడా ఆనందంలో మునిగిపోయారు. రాబిన్ ఊతప్ప, ఇర్ఫాన్ పఠాన్ లాంటి వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో టీమిండియాపై ప్రశంసల జల్లులు కురిపించాడు లెజెండ్ సచిన్ టెండూల్కర్. ఈ విక్టరీ ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నాడు. టాలెంట్ ఉన్న యంగ్‌స్టర్ నుంచి వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్‌గా రోహిత్ ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పాడు. కోహ్లీ ఓ ఛాంపియన్ అంటూ మెచ్చుకున్నాడు సచిన్.
‘ప్రామిసింగ్ యంగ్‌స్టర్ నుంచి వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ వరకు రోహిత్ శర్మ ప్రయాణాన్ని దగ్గర నుంచి గమనించా. క్రికెట్‌కు మన దేశం అందించిన గొప్ప టాలెంటెడ్ ప్లేయర్లలో రోహిత్ ఒకడు. టీ20 ప్రపంచ కప్ నెగ్గడంతో అతడి కెరీర్ మరింత చిరస్మరణీయంగా మారింది. కోహ్లీ గురించి కూడా చెప్పుకోవాలి. అతడు నిజమైన ఛాంపియన్. కెరీర్ మొదట్లో అతడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. నిన్నటి మ్యాచ్‌లో అతడు ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. అందుకే విరాట్‌ను గ్రేట్ క్రికెటర్ అనేది. లాంగ్ ఫార్మాట్స్‌లో కూడా కోహ్లీ ఇలాగే భారత జట్టుకు మరిన్ని అపూర్వ విజయాలు అందించాలని కోరుకుంటున్నా’ అని సచిన్ చెప్పుకొచ్చాడు. మరి.. కోహ్లీ-రోహిత్ మీద సచిన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
𝐄𝐍𝐃𝐈𝐍𝐆 𝐎𝐍 𝐀 𝐇𝐈𝐆𝐇@ImRo45, I’ve witnessed your evolution from a promising youngster to a World Cup-winning captain from close quarters. Your unwavering commitment & exceptional talent have brought immense pride to the nation. Leading 🇮🇳 to a T20 World Cup 🏆 victory… pic.twitter.com/QSEui6Bq2K
— Sachin Tendulkar (@sachin_rt) June 30, 2024