వరల్డ్ కప్​పై ‘కల్కి’ టీమ్ స్పెషల్ వీడియో.. ఒక్కో డైలాగ్​కు గూస్​బంప్స్ రావాల్సిందే!

వచ్చే నెలలో మొదలవనుంది ప్రపంచ కప్ సంగ్రామం. ఈ నేపథ్యంలో ‘కల్కి’ మూవీ టీమ్ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఇందులోని ఒక్కో డైలాగ్ వింటే గూస్​బంప్స్ రావాల్సిందే.

వచ్చే నెలలో మొదలవనుంది ప్రపంచ కప్ సంగ్రామం. ఈ నేపథ్యంలో ‘కల్కి’ మూవీ టీమ్ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఇందులోని ఒక్కో డైలాగ్ వింటే గూస్​బంప్స్ రావాల్సిందే.

టీ20 వరల్డ్ కప్​కు టైమ్ దగ్గర పడుతోంది. ప్రపంచ కప్ సంరంభానికి ఇంకా నాలుగు వారాల సమయం కూడా లేదు. వచ్చే నెల రెండో తేదీ నుంచే మెగా టోర్నీకి తెరలేవనుంది. బరిలోకి దిగితే కొదమసింహాల్లా పోరాడేవి కొన్ని, ఆఖరి బంతి వరకు ఓటమి ఒప్పుకోనివి మరికొన్ని, గెలుపోటములతో సంబంధం లేకుండా చెలరేగి ఆడేవి ఇంకొన్ని.. ఇలా ఈసారి వరల్డ్ కప్​లో తమ సత్తా చాటేందుకు అన్ని జట్లూ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టోర్నీలో పాల్గొనే దేశాలు తమ స్క్వాడ్స్​ను ప్రకటించాయి. ప్రపంచ కప్​కు ముందు ఒకట్రెండు టీ20 సిరీస్​లు ఆడి ఫుల్​గా ప్రిపేర్ అవ్వాలని చూస్తున్నాయి. ఈ తరుణంలో వరల్డ్ కప్ హీట్​ను మరింత పెంచాలని డిసైడ్ అయింది ‘కల్కి’ మూవీ టీమ్.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి’ మూవీ టీమ్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. వచ్చే నెలలో పొట్టి ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో టీమిండియాను సపోర్ట్ చేస్తూ సర్​ప్రైజ్ వీడియోను విడుదల చేసింది. అశ్వత్థామ పాత్రలో నటిస్తున్న బిగ్ బీ అమితాబ్ ఇందులో హైలైట్​గా నిలిచారు. ‘యుద్ధం ప్రతి రోజూ జరుగుతుంది. కానీ మహాయుద్ధం అన్నింటి కంటే కఠిన సవాళ్లను విసురుతుంది. ఇక్కడ ప్రతి క్షణం కీలకమే. అణువణువూ రక్తం పారుతుంది. ఇందులో ఓడినోడు కూడా హీరోనే. తల పైకి ఎత్తుకొని నడుస్తాడు’ అంటూ ఇందులో పవర్​ఫుల్ డైలాగులతో అమితాబ్ మెప్పించారు.

అశ్వత్థామ గెటప్​లోనే డైలాగ్స్ చెప్పారు అమితాబ్. బిగ్​బీ సంభాషణలకు అదిరిపోయే బీజీఎం, రోహిత్ శర్మ, జస్​ప్రీబ్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ కూడా కనిపించడంతో మరింత గూస్​బంప్స్ తెప్పిస్తాయి. ప్రపంచ కప్​లోని ప్రతి మ్యాచ్​ మహాయుద్ధంతో సమానమని, ఇక్కడ ఓడిన జట్టు కూడా విజేతేనని, రక్తం చిందించకుండా యుద్ధం చేయలేమంటూ అమితాబ్ చెప్పిన డైలాగ్స్​ మెగా టోర్నీపై అందరిలోనూ మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘కల్కి’ టీమ్ రూపొందించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. వీడియో భలేగా ఉందని, అమితాబ్ డైలాగ్స్ పలికిన తీరు సూపర్బ్​గా ఉందని మెచ్చుకుంటున్నారు. మరి.. ‘కల్కి’ వరల్డ్ కప్ ప్రోమో మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments