వీడియో: టీ20 WC ఫైనల్‌లో బ్యాటింగ్‌కి వెళ్తూ కోహ్లీ-రోహిత్‌ ఏం చేశారో చూడండి!

వీడియో: టీ20 WC ఫైనల్‌లో బ్యాటింగ్‌కి వెళ్తూ కోహ్లీ-రోహిత్‌ ఏం చేశారో చూడండి!

Rohit Sharma, Virat Kohli, T20 World Cup 2024, Final: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్‌ను అప్పుడే క్రికెట్‌ అభిమానులు మర్చిపోయి ఉండరు కానీ, ఆ ఫైనల్‌లో రోహిత్‌-కోహ్లీ మధ్య జరిగిన ఓ సూపర్‌ సీన్‌ను అంతా మిస్‌ అయి ఉంటారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, Virat Kohli, T20 World Cup 2024, Final: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్‌ను అప్పుడే క్రికెట్‌ అభిమానులు మర్చిపోయి ఉండరు కానీ, ఆ ఫైనల్‌లో రోహిత్‌-కోహ్లీ మధ్య జరిగిన ఓ సూపర్‌ సీన్‌ను అంతా మిస్‌ అయి ఉంటారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచి యావత్‌ దేశాన్ని గర్వించేలా చేసింది రోహిత్‌ సేన. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఛాంపియన్స్‌గా టీమిండియా నిలిచిన విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌లో ఎదురైన ఓటమి గాయానికి మందు రాసుకుంటూ.. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ముందుండి నడిపిస్తుంటే.. బౌలర్లు ప్రత్యర్థి జట్ల ఓటమిని శాసిస్తుంటే.. బిగ్‌ మ్యాచ్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ ఫైనల్లో తన అనుభవంతో మ్యాచ్‌ను కాపాడి.. మొత్తం అందరి సమిష్టి కృషితో టీమిండియా విశ్వవిజేతగా అవతరించింది.

ఫైనల్‌ మ్యాచ్‌లో ప్రతి బాల్‌ను ఆస్వాదించిన క్రికెట్‌ అభిమానులు సరిగ్గా మ్యాచ్‌ ప్రారంభం అయ్యే క్షణాల్లో టీమిండియాకు రెండు కళ్లలాంటి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ చేసిన ఒక పనిని గుర్తించలేకపోయారు. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ కావడంతో అందరిలో ఒకింత ఉత్కంఠ ఉంటుంది. అలాంటి మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేయడానికి వస్తున్న ఉద్విగ్న క్షణాల్లో ఇద్దరు ఆటగాళ్లు సరిగ్గా పిచ్‌ వద్దకు రాగానే హగ్‌ చేసుకున్నారు. సాధారణంగా ఏ ఓపెనర్లు అయినా.. పంచ్‌తో చీర్స్‌ చెప్పి వెళ్లి స్ట్రైక్‌ తీసుకుంటారు.

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో తొలి మ్యాచ్‌ నుంచి ఓపెనర్లుగానే ఆడిన రోహిత్‌-కోహ్లీ కూడా అలాగే పంచ్‌తో చీర్స్‌ చెప్పి బ్యాటింగ్‌ చేశారు. కానీ, ఫైనల్‌లో మాత్రం బ్యాటింగ్‌కి వచ్చి, స్ట్రైక్‌ తీసుకునే ముందు ఇద్దరు హగ్‌ చేసుకున్నారు. ఎందుకంటే.. అదే తమకు చివరి మ్యాచ్‌ అని, పైగా దేశానికి కప్పు అందించే మ్యాచ్‌ కావడంతో ఇద్దరు సీనియర్‌ ఆటగాళ్లు కాస్త ఎమోషనల్‌ అయినట్లు తెలుస్తోంది. 15 ఏళ్లుగా కలిసి ఆడుతూ.. తొలిసారి వరల్డ్‌ కప్‌ను కలిసి ఎత్తనున్నట్లు వాళ్లకు ముందే అనిపించిందేమో అందుకే హగ్‌ చేసుకున్నారు అని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. కోహ్లీ-రోహిత్‌ హగ్‌ చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఫైనల్‌ తర్వాత రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఇద్దరు ఆటగాళ్లు హగ్‌ చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments