రజినీకాంత్ జోరు.. మారి సెల్వరాజ్ తో క్రేజీ ప్రాజెక్ట్!

Rajinikanth Movie With Mari Selvaraj: సూపర్ స్టార్ రజినీకాంత్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారి సెల్వరాజ్ తో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఆ వివరాల్లోకి వెళితే..

Rajinikanth Movie With Mari Selvaraj: సూపర్ స్టార్ రజినీకాంత్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారి సెల్వరాజ్ తో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఆ వివరాల్లోకి వెళితే..

సూపర్ స్టార్ రజినీకాంత్.. ‘జైలర్’ మూవీ హిట్ తర్వాత మళ్లీ టచ్ లోకి వచ్చారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రం తర్వాత స్పీడ్ పెంచాడు సూపర్ స్టార్. వరుసగా సినిమాలు చేస్తూ.. యంగ్ హీరోస్ కు సవాల్ విసురుతున్నాడు. ఇప్పటికే రెండు చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతుండగా.. తాజాగా ఓ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. పైగా ఆ డైరెక్టర్ అంటే రజినీకి ఎంతో ఇష్టం కూడా. దాంతో ఈ సాలిడ్ కాంబో తెరకెక్కడం ఖాయంగా తెలుస్తోంది.

రజినీకాంత్ వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఇప్పటికే మూడు ప్రాజెక్ట్స్ చేతిలో ఉండగా.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కర్ణన్, మామన్నన్ చిత్రాలతో సౌత్ ఇండియా ప్రేక్షకులను కట్టిపడేసిన డైరెక్టర్ మారి సెల్వరాజ్. ఇప్పుడు ఇతడి డైరెక్షన్ లోనే రజినీకాంత్ ఓ మూవీ చేయబోతున్నట్లు పరిశ్రమలో జోరుగా చర్చనడుస్తోంది. సెల్వరాజ్ టాలెంట్ ను గుర్తించిన సూపర్ స్టార్ అతడికి ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. అదీకక గతంలో మారి సెల్వరాజ్ చేసిన కామెంట్స్ సైతం వీరిద్దరి కాంబోలో మూవీ కన్ఫామ్ గా ఉంటుందని తెలుస్తోంది.

కాగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మారి సెల్వరాజ్ మాట్లాడుతూ..”సూపర్ స్టార్ రజినీకాంత్ కు నేనంటే చాలా ఇష్టం. కర్ణన్, మామన్నన్ సినిమాలు చూసి, నన్ను ఆయన అభినందించారు. ఆ టైమ్ లో ఇద్దరం కలిసి ఓ మూవీ చేయాలనుకున్నాం. ఇప్పుడు కథ కూడా రెడీగా ఉంది. ఈ సినిమాకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయి” అని చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ ఇచ్చిన ఈ క్లారిటీతో వీరిద్దరి కాంబినేషన్ లో కచ్చితంగా మూవీ ఉంటుందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రజినీ నటించిన ‘వెట్టయాన్’ అక్టోబర్ 10న థియేటర్లలోకి రానుంది. అలాగే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ అనే మూవీలో సూపర్ స్టార్ నటిస్తున్నాడు. వీటితో పాటుగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించే ‘జైలర్’ కూడా రజినీ చేతిలో ఉంది. అయితే జైలర్ సీక్వెల్ తర్వాతే మారి సెల్వరాజ్ మూవీ పట్టాలెక్కనున్నట్లు సమాచారం. మరి మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో రజినీకాంత్ మూవీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments