SNP
ఎంఎస్ ధోని.. భారత క్రికెట్ అభిమానులకే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌కి పరిచయం అక్కర్లేని పేరు. ధోని క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. అయితే అదే క్రేజ్ వల్ల ధోని చిక్కుల్లో పడ్డాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఎంఎస్ ధోని.. భారత క్రికెట్ అభిమానులకే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌కి పరిచయం అక్కర్లేని పేరు. ధోని క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. అయితే అదే క్రేజ్ వల్ల ధోని చిక్కుల్లో పడ్డాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్ ధోనికి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి ఏళ్లు గడుస్తున్న తర్వాత కూడా ధోని క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదు. ఇప్పటికీ ధోని ఏం చేసినా.. హెడ్‌లైన్స్‌లో ఉంటుంది. ఐపీఎల్‌లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. కేవలం ధోని ఆట చూసేందుకే చాలా మంది స్టేడియానికి వస్తున్నారు. అది ధోని క్రేజ్. అయితే.. ఇదే క్రేజ్ ధోనిని చాలా సార్లు ఇబ్బంది పెట్టింది. తాజాగా మరోసారి ధోని తన అభిమానుల నుంచి తీవ్ర ఇబ్బంది పడ్డాడు.
ధోనిని వందల సంఖ్యలో అభిమానులు చుట్టుముట్టి, సెల్ఫీల కోసం ఎగబడుతుంటే.. బౌన్సర్లు కూడా వారిని కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో.. ధోని అక్కడి నుంచి పరుగు అందుకున్నాడు. అభిమానుల నుంచి తప్పించుకుని ధోని రోడ్లపై పరిగెడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానం ఉండాలి కానీ, మరి ఇంత ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని కొంతమంది నెటిజన్లు ఆ వీడియోకు కామెంట్ చేస్తున్నారు. అయితే.. ఇంకో విశేషం ఏంటంటే.. ఇది జరిగింది ఇండియాలో కాదు, దుబాయ్‌లో.
ఇండియాలో క్రికెటర్లు అంటే డెమీ గాడ్స్‌లా భావించే వారు చాలా మందే ఉన్నారు. కానీ, దుబాయ్‌లో కూడా ధోనికి ఇంత క్రేజ్ ఉందా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సెల్ఫీల కోసం అభిమానులు మీదపడుతుంటే.. వారి నుంచి తప్పించుకుని.. ధోని దుబాయ్ రోడ్లపై పరుగులు పెట్టాడు. పైగా ఎటు వెళ్లాలో కూడా ధోనికి తెలియక కంగారు పడ్డాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో క్లారిటీ లేకపోయినా.. ఈ మధ్య కాలంలో ధోని దుబాయ్ వెకేషన్‌కు వెళ్లినప్పుడు జరిగి ఉండొచ్చని సమాచారం. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Fans Chasing Mahi ❤️😄#MSDhoni pic.twitter.com/IjhZ2ySjwR
— Chakri Dhoni (@ChakriDhoni17) February 5, 2024