ఈ ఇన్నింగ్స్ తో హ్యాపీగా లేను.. ఎందుకంటే? ఇషాన్ కిషన్ షాకింగ్ కామెంట్స్!

  • Author Soma Sekhar Published - 01:54 PM, Wed - 2 August 23
  • Author Soma Sekhar Published - 01:54 PM, Wed - 2 August 23
ఈ ఇన్నింగ్స్ తో హ్యాపీగా లేను.. ఎందుకంటే? ఇషాన్ కిషన్ షాకింగ్ కామెంట్స్!

వెస్టిండీస్ తో జరిగిన మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో దుమ్మురేపాడు టీమిండియా యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్. వరుసగా మూడు వన్డేల్లోనూ అర్దశతకాలు బాది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని సరసన చేరాడు ఇషాన్ కిషన్. ఇక చివరి వన్డేలో 77 పరుగులతో అదరగొట్టిన ఈ యువ బ్యాటర్.. మ్యాచ్ అనంతరం పలు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో నేను హ్యాపీగాలేను అంటూ.. ఆసక్తికర కామెంట్స్ చేశాడు. టీమిండియా రోహిత్ శర్మ గైర్హాజరీతో ఓపెనర్ గా దిగే అవకాశం వచ్చింది ఇషాన్ కు. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ.. మూడు మ్యాచ్ ల్లో మూడు హాఫ్ సెంచరీలు బాదాడు. అయితే తన బ్యాటింగ్ తో సంతోషంగా లేను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అతడు.

ఇషాన్ కిషన్.. వెస్టిండీస్ తో జరిగిన మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో చెలరేగిపోయాడు. వరుసగా మూడు అర్దశతకాలు బాది రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని సరసన చేరాడు. ఇషాన్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చినప్పటికీ అతడు సంతోషంగా లేడట. ఈ విషయాన్ని స్వయంగా అతడే చెప్పుకొచ్చాడు. మూడో వన్డే అనంతరం మాట్లాడిన ఇషాన్.. తన బ్యాటింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఇషాన్ కిషన్ మాట్లాడుతూ..”నేను బాగానే ఆడుతున్నప్పటికీ.. మంచి ఇన్నింగ్స్ లను భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాను. అదీకాక నేను మూడో వన్డేలో ఔటైన విధానం నాకే నచ్చలేదు. అందుకే నేను ఈ ఇన్నింగ్స్ తో హ్యాపీగా లేను. క్రీజులో ఉండి భారీ స్కోర్లు చేయాలని నా సీనియర్లు చెబుతూనే ఉన్నారు. ఇలాంటి కీలక మ్యాచ్ ల్లో విజయం సాధించడం ఆనందంగా ఉంది. ఇక శుభ్ మన్ గిల్ సూపర్బ్ ప్లేయర్. అతడు బంతిని అంచనా వేయడంలో దిట్ట” అంటూ చెప్పుకొచ్చాడు ఇషాన్ కిషన్. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం లేదంటూ చెప్పుకొచ్చాడు ఇషాన్. ప్రస్తుతం తన దృష్టి అంతా రాబోయే టోర్నీలపైనే ఉందని పేర్కొన్నాడు. ఏ క్రికెటర్ జీవితాన్నైనా ఒకే ఒక్క టోర్నీ మార్చేయగలదని అతడు వ్యాఖ్యానించాడు. ఇక ఈ సిరీస్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఇషాన్ కిషన్ తన ప్లేస్ ను టీమిండియాలో మరింత బలపరుచుకున్నాడు.

ఇదికూడా చదవండి: 2023 ప్రపంచ కప్ లో హాట్ ఫేవరెట్ టీమిండియానే: వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్

Show comments