Nidhan
టీమిండియా స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ చుట్టూ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరికీ భారత క్రికెట్ బోర్డు నుంచి ఓ షాకింగ్ న్యూస్.
టీమిండియా స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ చుట్టూ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరికీ భారత క్రికెట్ బోర్డు నుంచి ఓ షాకింగ్ న్యూస్.
Nidhan
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత ధనిక బోర్డుగా పేరు తెచ్చుకున్న బీసీసీఐ ప్రపంచ క్రికెట్‌ను కనుసైగతో శాసిస్తోంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో మన బోర్డు ఏం చెబితే అదే శాసనమనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే బీసీసీఐతో పెట్టుకునేందుకు అందరూ వెనుకాడతారు. బోర్డుతో పెట్టుకున్న చాలా మంది తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు మరో ఇద్దరు క్రికెటర్లు కూడా ఈ లిస్టులో చేరేలాగే ఉన్నారు. వాళ్లు మరెవరో కాదు.. భారత స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్. బీసీసీఐ మాటను ధిక్కరించిన ఈ ఇద్దరు క్రికెటర్ల కెరీర్లు ఇప్పుడు డేంజర్లో పడ్డాయి. వీళ్లకు షాక్ ఇచ్చేందుకు బోర్డు సిద్ధమైందని సమాచారం. అయ్యర్, ఇషాన్ చుట్టూ అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్‌లను రద్దు చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే బోర్డు పెద్దలు సమాలోచనలు చేశారని.. అతి త్వరలో దీనిపై కీలక నిర్ణయం వెలువడనుందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. రంజీల్లో ఆడాలని ఆదేశించినా వాళ్లిద్దరూ ధిక్కరించడం, తమ మాటను కాదని ఐపీఎల్ కోసం ప్రాక్టీస్‌లో మునిగిపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని టాక్. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ తొలగింపునకు అవసరమైన చర్యలకు బోర్డు అధికారులు సిద్ధమయ్యారని సమాచారం. దీంతో ఇషాన్, అయ్యర్ కెరీర్ క్లోజ్ అయినట్లేనని వినికిడి. ఒకవేళ బోర్డు గనుక కాంట్రాక్ట్ నుంచి తీసేస్తే వీళ్లు టీమిండియా తరఫున ఆడేందుకు అర్హులు కారు. ఈ మధ్య కాలంలో ఏ ప్లేయర్ విషయంలోనూ బీసీసీఐ ఇంత కఠిన నిర్ణయం తీసుకోలేదు.
ఇషాన్, అయ్యర్ వ్యవహరిస్తున్న తీరు, ఆదేశాలను పాటించకపోవడం, ధిక్కార స్వరం వినిపించడం, భారత జట్టు కంటే ఐపీఎల్‌కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం, ఇగో చూపించడం వల్లే పరిస్థితి ఇంతదాకా వచ్చిందని తెలుస్తోంది. కోచ్ రాహుల్ ద్రవిడ్ రంజీల్లో ఆడమని సూచించినా ఇషాన్ వినకపోవడంతో మొదలైన వివాదం.. అతడు మళ్లీ బోర్డు మాటను ధిక్కరించడంతో పీక్కు చేరుకుందని తెలిసింది. కాగా, టీమిండియాకు దూరంగా ఉన్నవారు, జట్టు ఆడే సిరీస్‌లో చోటు దక్కని క్రికెటర్లు తప్పనిసరిగా డొమెస్టిక్ క్రికెట్లో ఆడాల్సిందేనని ఇటీవల బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్లేయర్, ఈ ప్లేయర్ అనే తేడా లేదు.. ఎంతటి ఆటగాడైనా సరే జట్టుకు దూరంగా ఉంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడక తప్పదని బోర్డు సెక్రటరీ జై షా రీసెంట్గా వార్నింగ్ ఇచ్చారు.
జై షా హెచ్చరించినా ఇషాన్ బోర్డు ఆదేశాలను పట్టించుకోలేదు. సౌతాఫ్రికా టూర్ నుంచి టీమిండియాకు దూరంగా ఉంటున్న అతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడాలనే ఆదేశాలను పెడ చెవిన పెట్టాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లోని మిగిలిన మ్యాచుల్లో జట్టులో చోటు కోల్పోయిన అయ్యర్ కూడా బోర్డు రూల్‌ను బేఖాతరు చేశాడు. ఇద్దరూ రంజీల్లో ఆడలేదు. ఐపీఎల్ ప్రిపరేషన్స్‌లో భాగంగా జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ బిజీ అయిపోయాడు ఇషాన్. దీంతో సీరియస్ అయిన బీసీసీఐ ఇద్దరి కాంట్రాక్టుల్ని తీసేసేందుకు సిద్ధమవుతోందని సమాచారం. ఒకవేళ అదే జరిగితే వరల్డ్ క్రికెట్లో ఇది సెన్సేషనల్ న్యూస్‌గా మారుతుంది. టీమ్‌కు కీలకమైన ఇద్దరు ఆటగాళ్ల కాంట్రాక్టులను తొలగించడం అనేది మామూలు విషయం కాదు. ఈ విషయంలో బోర్డు ఏం చేస్తుందో చూడాలి. మరి.. అయ్యర్, ఇషాన్ కెరీర్ విషయంలో బీసీసీఐ ఏం చేస్తే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: టీమిండియాలో కొత్త సెంటిమెంట్.. వాళ్లొస్తే ఇరగదీయడం పక్కా!
Ishan Kishan and Shreyas Iyer may lose their central contracts with the BCCI due to their absence from the ongoing Ranji Trophy 👀#BCCI #IshanKishan #ShreyasIyer #TeamIndia #CricketTwitter pic.twitter.com/sL2FjubsXt
— InsideSport (@InsideSportIND) February 23, 2024
Shreyas Iyer & Ishan Kishan pic.twitter.com/jzkEAXIvSK
— RVCJ Media (@RVCJ_FB) February 23, 2024