Nidhan
సన్‌రైజర్స్ నయా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముందు ఓ భారీ టార్గెట్ ఉంది. ఇది ట్రోఫీ నెగ్గడం కంటే కూడా పెద్దది. అసలు ఏంటా లక్ష్యం? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
సన్‌రైజర్స్ నయా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముందు ఓ భారీ టార్గెట్ ఉంది. ఇది ట్రోఫీ నెగ్గడం కంటే కూడా పెద్దది. అసలు ఏంటా లక్ష్యం? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
ఐపీఎల్-2024కు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సన్నద్ధమవుతోంది. లీగ్ స్టార్ట్ అయిన రెండో రోజే మన జట్టు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. మొదటి దశలో ఆడే నాలుగు మ్యాచుల్లో ఒకటి మాత్రమే హోమ్ గ్రౌండ్లో ఆడనుంది ఎస్ఆర్హెచ్. మిగతా మూడు మ్యాచులు ఇతర వేదికల్లోనే జరగనున్నాయి. దీంతో ఫస్ట్ ఫేస్‌లో మనకు హోమ్ అడ్వాంటేజ్ పెద్దగా ఉండదు. ఇక, కొత్త సీజన్ కోసం సన్‌రైజర్స్ ప్లేయర్లు తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని కసి మీద ఉన్నారు. కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా నెట్స్‌లో శ్రమిస్తున్నాడు. అయితే ఈ సీజన్లో అతడికి భారీ టార్గెట్ సెట్ చేసింది ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్. కమిన్స్ ముందున్న లక్ష్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎస్ఆర్హెచ్ గత కొన్ని సీజన్లుగా అట్టర్ ఫ్లాప్ అవుతోంది. పాయింట్స్ టేబుల్లో దిగువన ఉన్న టీమ్స్‌తో పోటీపడుతోంది. దీంతో గంపెడాశలు పెట్టుకున్న అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. మన జట్టు టైటిల్ నెగ్గడం కష్టమనే భావనలో ఉన్నారు. అయితే ఈసారి కొత్త కెప్టెన్ రావడం, టీమ్ లైనప్ కూడా బలంగా ఉండటంతో కప్పు మీద మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ట్రోఫీ మాత్రమే కాదు కమిన్స్ ముందు ఇంకో భారీ టార్గెట్ ఉంది. అది రీచ్ అయితే తప్ప టైటిల్ కొట్టలేడు. అదే జట్టును ఒక్క తాటి పైకి తీసుకురావడం. ఒక టీమ్‌లా కలసి ఆడటం, ఇండివిడ్యువల్ పెర్ఫార్మెన్స్ల కంటే జట్టు గెలుపే ముఖ్యం అనే భావన ప్లేయర్లలో కల్పించడం, యంగ్‌స్టర్స్‌కు సరైన అవకాశాలు ఇస్తూ ఫెయిలైనా చోటు పక్కా అనే భరోసాను ఇవ్వడం.
ఈ టార్గెట్‌ను కమిన్స్‌కు కావ్య పాప ఇచ్చిందని తెలుస్తోంది. ఇలా ఒక జట్టుగా కలసి ఆడటం, ఫియర్లెస్ అప్రోచ్‌తో ముందుకెళ్లడం, ప్రత్యర్థులను భయపెట్టడం, గెలుపోటముల కంటే టీమ్‌గా ఎంత బాగా ఆడాం అనేది కంగారూ క్రికెట్లో బాగా ఇమిడిపోయిన కల్చర్. సో, దీన్ని ఎస్ఆర్హెచ్కు అలవాటు చేయాలని కావ్య పాప కొత్త సారథికి ఆదేశించిందట. ఒకవేళ అదే జరిగితే మాత్రం సన్‌రైజర్స్‌ను ఆపడం ఎవరి తరం కాదు. నిర్భయంగా, జట్టుగా కలసి ఆడటం మొదలుపెడితే ఒక్క కప్పు కాదు.. ఎన్ని అయినా కొట్టొచ్చనే ఆలోచనతోనే కమిన్స్‌కు కావ్య పాప ఈ టార్గెట్ సెట్ చేశారని అంటున్నారు. ట్రోఫీ నెగ్గడం కంటే జట్టులో ఉన్న సమస్యలకు ముందు చెక్ పెట్టి, టీమ్ ఓ యూనిట్లా ముందుకు కదిలితే తిరుగుండదని ఆమె అనుకుంటున్నారట. మరి.. కావ్య పెట్టిన లక్ష్యాన్ని కమిన్స్ రీచ్ అవుతాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: వీడియో: సన్‌రైజర్స్‌లో నయా ABD.. ఈ సారి ఊచకోతే!
A glimpse at our action-packed practice match 1️⃣ at Uppal 👊🤩
Watch the match replay on our official YouTube channel👉 https://t.co/B5fBOrLrdf pic.twitter.com/PoyZ6bJkOM
— SunRisers Hyderabad (@SunRisers) March 19, 2024