విశాఖపట్నంలో IPL మ్యాచ్​లు! ఏయే తేదీల్లో అంటే..?

విశాఖపట్నం క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్. ఈసారి వైజాగ్​లో ఐపీఎల్ మ్యాచ్​లు జరగనున్నాయి. ఏయే తేదీల్లో ఏయే జట్ల మధ్య మ్యాచ్​లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

విశాఖపట్నం క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్. ఈసారి వైజాగ్​లో ఐపీఎల్ మ్యాచ్​లు జరగనున్నాయి. ఏయే తేదీల్లో ఏయే జట్ల మధ్య మ్యాచ్​లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్​ల షెడ్యూల్ వచ్చేసింది. అయితే ఫుల్ షెడ్యూల్ కాకుండా తొలి విడత షెడ్యూల్​ను మాత్రమే ప్రకటించారు టోర్నీ నిర్వాహకులు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు మొత్తం 21 మ్యాచ్​లు ఆయా వేదికల్లో జరగనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ మధ్య ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. దీనికి చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక కానుంది. తొలి విడత టోర్నీలో 4 డబుల్ హెడర్ మ్యాచ్​లు ఉన్నాయి. ఇక ఈసారి విశేషం ఏంటంటే.. విశాఖపట్నంలోనూ ఐపీఎల్ మ్యాచ్​లు జరగనున్నాయి. కానీ సన్​రైజర్స్ హైదరాబాద్​కు కాకుండా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్​కు వైజాగ్ హోమ్ గ్రౌండ్ కానుంది. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

మార్చి 31, ఏప్రిల్ 3వ తేదీల్లో విశాఖపట్నం వేదికగా ఐపీఎల్ మ్యాచ్​లు జరగనున్నాయి. ఈ రెండూ ఢిల్లీ క్యాపిటల్స్ ఆడే మ్యాచ్​లే కావడం విశేషం. తొలి విడత టోర్నీలో ఢిల్లీకి వైజాగ్ హోమ్ గ్రౌండ్ కానుంది. విమెన్స్ ప్రీమియర్ లీగ్​లోని ఎలిమినేటర్ సహా ఫైనల్ మ్యాచ్ కూడా ఢిల్లీలోని అరుణ్​ జైట్లీ గ్రౌండ్​లోనే జరగనున్నాయి. డబ్ల్యూపీఎల్ ముగిసిన 11 రోజుల్లోనే ఢిల్లీ క్యాపిటల్స్ తమ సొంత గ్రౌండ్​లో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఒకే గ్రౌండ్​లో వరుసగా మ్యాచ్​లు నిర్వహిస్తే పిచ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్ల ఢిల్లీ ఫ్రాంచైజీ-బీసీసీఐ కలసి వైజాగ్​లో మ్యాచ్​లు నిర్వహించాలని నిర్ణయించాయని తెలిసింది.

మార్చి 31వ తేదీన చెన్నైతో, ఏప్రిల్ 3న కోల్​కతాతో వైజాగ్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. రెండో విడత టోర్నీలో మాత్రం ఢిల్లీ మిగిలిన 5 మ్యాచ్​లు యాథావిధిగా హోమ్ గ్రౌండ్​లోనే ఆడనుంది. వైజాగ్​లో ఐపీఎల్​ మ్యాచ్​లు జరగనుండటంతో అక్కడి క్రికెట్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్​ మ్యాచుల్ని లైవ్​గా చూస్తూ ఎంజాయ్ చేసేందుకు తమకు ఛాన్స్ దొరికిందని అంటున్నారు. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోబోమని.. తప్పకుండా టికెట్లు సంపాదించి మ్యాచులు చూస్తామని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, వైజాగ్​లో మ్యాచ్​లు జరగడంపై ఢిల్లీ క్యాపిటల్స్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. విశాఖ తమ న్యూ హోమ్ అని.. ఇది మరో ఢిల్లీ అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చింది. మరి.. వైజాగ్​లో ఐపీఎల్ మ్యాచ్​లు జరగనుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: నవ్వుల పాలవుతున్న పాకిస్థాన్‌ ఫీల్డింగ్‌! మీకు మీరే సాటి..

Show comments