Nidhan
ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ కొత్త సీజన్ కోసం ఎదురు చూస్తోంది. కెప్టెన్సీ మార్పు జరిగింది కాబట్టి ఈ టీమ్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ నేపథ్యంలో ముంబై బలాబలాలు, విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ కొత్త సీజన్ కోసం ఎదురు చూస్తోంది. కెప్టెన్సీ మార్పు జరిగింది కాబట్టి ఈ టీమ్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ నేపథ్యంలో ముంబై బలాబలాలు, విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Nidhan
ఐపీఎల్లో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటిగా ముంబై ఇండియన్స్‌ను చెప్పొచ్చు. ఈ టీమ్ నిండా స్టార్లే ఉంటారు. అందుకే ముంబై ఆడుతుంటే చూడాలని అందరూ కోరుకుంటారు. ఎంతమంది స్టార్లు ఉన్నా సరికొత్త సూపర్స్టార్లను తయారు చేయడంపై ముంబై యాజమాన్యం పనిచేస్తూ వచ్చింది. దాని ఫలితమే ఇవాళ హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్. వీళ్లు ముగ్గురూ ఈ రేంజ్లో ఉన్నారంటే దీనికి ముంబై ఫ్రాంచైజీకి ఎంత క్రెడిట్ ఇచ్చినా తక్కువే. అయితే ఆ టీమ్‌కు 5 ట్రోఫీలు అందించి.. పాండ్యా, బుమ్రా లాంటోళ్లకు అండగా నిలిచి, ఈ స్థాయికి ఎదిగేలా చేసి, పటిష్టమైన టీమ్‌ను తయారు చేసిన రోహిత్ శర్మను మాత్రం కెప్టెన్సీ నుంచి తీసేశారు. నయా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించారు. దీంతో ఐపీఎల్-2024లో ముంబై ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు బలం, బలహీనతలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ముంబై ప్రధాన బలం బ్యాటింగ్ లైనప్. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా రూపంలో టాప్-5లో బెస్ట్ బ్యాటర్స్ ఆ టీమ్‌లో ఉన్నారు. లోయరార్డర్లో ఒంటిచేత్తో భారీ సిక్సులు కొట్టే టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, మహ్మద్ నబి లాంటి హార్డ్ హిట్టర్లు ఉండటం ఆ జట్టుకు ఉన్న మరో బలం. ఓపెనర్లుగా రోహిత్-ఇషాన్ రూపంలో ఎక్స్పీరియెన్స్డ్ క్యాంపెయినర్స్ ఉండటం కలిసొచ్చే అంశం. ముంబై బౌలింగ్ యూనిట్ కూడా వైవిధ్యంగా ఉంది. పేస్ అటాక్‌ను జస్ప్రీత్ బుమ్రా లీడ్ చేయనున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న బుమ్రాకు తోడుగా నిప్పులు చెరిగే బంతులతో భయపెట్టే గెరాల్డ్ కొయెట్జీ, జేసన్ బెరెండార్ఫ్తో బౌలింగ్ యూనిట్ పటిష్టంగా కనిపిస్తోంది. దిల్షాన్ మధుశనక రూపంలో మరో క్వాలిటీ పేసర్ టీమ్‌లో ఉండటం కూడా కలిసొచ్చే అంశం. తాను కూడా బౌలింగ్ చేస్తానని కెప్టెన్ హార్దిక్ ఆల్రెడీ ప్రకటించాడు.
ముంబైకి రెండు అతిపెద్ద బలహీనతలు ఉన్నాయి. ఒకటి రోహిత్-హార్దిక్ వార్ అయితే మరొకటి స్పిన్ అటాక్. కెప్టెన్సీ మార్పు నేపథ్యంలో పాత సారథి హిట్‌మ్యాన్, కొత్త కెప్టెన్ పాండ్యా ఎంతవరకు ఒక్కటిగా కలసి పని చేస్తారనేది జవాబు లేని ప్రశ్నగా మారింది. ఇన్ని ట్రోఫీలు అందించినా తనకు చివరకు అన్యాయం జరిగిందనే బాధ రోహిత్లో ఉంది. దాన్ని దిగమింగుకొని హార్దిక్ లాంటి తాను తయారు చేసిన ఓ జూనియర్‌తో కలసి హిట్‌మ్యాన్ టీమ్‌ను ఎంత వరకు ముందుకు నడిపిస్తాడో చెప్పలేం. ఒకవేళ వీళ్లిద్దరి మధ్య వార్ మరింత పెరిగి, ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోకుండా ఆడితే మాత్రం ముంబై మునిగిపోవడం ఖాయం.
ముంబైకి ఉన్న మరో బిగ్ వీక్నెస్ స్పిన్ అటాక్. మొదట్నుంచి పేస్ యూనిట్‌ను బలంగా మార్చుకుంటూ వస్తున్న ఆ జట్టు.. స్పిన్‌ను మాత్రం లైట్ తీసుకుంటోంది. అదే చాలా మ్యాచుల్లో కీలక సమయాల్లో దెబ్బతీసింది. ఈసారి కూడా ముంబై స్పిన్ విభాగం ఏమంత గొప్పగా లేదు. పీయుష్ చావ్లా తప్ప టీమ్‌లో చెప్పుకోదగ్గ మరో స్పిన్నర్ లేడు. కుమార్ కార్తికేయ, షమస్ ములానీ, శ్రేయస్ గోపాల్ రూపంలో టాలెంటెడ్ స్పిన్నర్లు ఉన్నా వీళ్లు ట్రంప్‌కార్డు అనలేం. వీళ్లకు ఎంతవరకు అవకాశాలు వస్తాయో కూడా డౌటే. ఇక, గాయం తర్వాత రీఎంట్రీ ఇస్తున్న హార్దిక్ అటు బ్యాటర్‌గానే గాక బౌలర్‌గా, అలాగే కెప్టెన్‌గా రాణించాల్సి ఉంటుంది. రోహిత్ కంటే తానే బెటర్ అని ప్రూవ్ చేసుకోవాలంటే అతడు తన బెస్ట్ ఇవ్వాలి. కానీ కెప్టెన్సీ మార్పు మంటలు చల్లారకపోవడం, పాండ్యా తీరు లాంటివి చూస్తుంటే ఆ టీమ్‌కు అతడే పెద్ద తలనొప్పిగా మారాడని చెప్పక తప్పదు.
ముంబై ఇప్పటిదాకా ఐదుసార్లు ఐపీఎల్ ట్రీఫీని గెలుచుకుంది. చివరగా 2020లో ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత రెండేళ్లు లీగ్ స్టేజ్‌కు పరిమితమైంది. గతేడాది మాత్రం ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయింది.
ముంబై జట్టు బలం, బలహీనతలు, గత రికార్డులు చూస్తే ఆ టీమ్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం ఈసారి కన్ఫర్మ్ అని చెప్పలేం. కానీ రోహిత్-పాండ్యా విభేదాలను వదిలేసి కలసి ఆడితే మాత్రం ఇది సాధ్యమే. ఒకవేళ వాళ్ల వార్ మరింత ఎక్కువైతే మాత్రం ఆ టీమ్ లీగ్ దశకే పరిమితమైనా షాక్ అవ్వాల్సిన పనిలేదు. మిగిలిన ప్లేయర్లు ఎలా రాణిస్తారనేది ముఖ్యమే. కానీ టీమ్‌కు బిగ్ స్ట్రెంగ్త్ అయిన రోహిత్-పాండ్యా జోడీ ఏం చేస్తారు? అనే దాని మీదే ముంబై జర్నీ డిపెండ్ అయింది.
ఇదీ చదవండి: వీడియో: SRH ఆంథమ్ వచ్చేసింది.. కొత్త సాంగ్ మామూలుగా లేదుగా!