గిల్ సూపర్ సెంచరీ.. కెరీర్​లో చాలా స్పెషల్ నాక్!

టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్ తన బ్యాట్ పవర్ ఏంటో ఇంగ్లండ్​కు మరోమారు చూపించాడు. ధర్మశాల టెస్టులో సూపర్బ్ సెంచరీతో ఆకట్టుకున్నాడతను.

టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్ తన బ్యాట్ పవర్ ఏంటో ఇంగ్లండ్​కు మరోమారు చూపించాడు. ధర్మశాల టెస్టులో సూపర్బ్ సెంచరీతో ఆకట్టుకున్నాడతను.

టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. ధర్మశాల వేదికగా జరుగుతున్న 5వ టెస్టులో సెంచరీతో చెలరేగాడతను. 137 బంతుల్లో 100 పరుగుల మార్క్​ను చేరుకున్నాడతను. అతడి టెస్ట్ కెరీర్​లో ఇది టాప్ నాక్స్​లో ఒకటిగా నిలిచిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గిల్ బ్యాటింగ్ అంత అద్భుతంగా సాగింది. ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్​గా బ్యాటింగ్ చేశాడతను. ధనాధన్ ఇన్నింగ్స్​తో ప్రత్యర్థి బౌలర్లను ప్రెజర్​లోకి నెట్టాడు. 10 బౌండరీలతో పాటు 5 భారీ సిక్సులు బాది ఇంగ్లండ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. టెస్టుల్లో అవసరమైతే టీ20 తరహా బ్యాటింగ్ చేయగలనని ప్రూవ్ చేశాడు గిల్.

స్పిన్, పేస్ రెండింటినీ అంతే సమర్థంగా ఎదుర్కొన్న గిల్.. ఏ బౌలర్​నూ విడిచి పెట్టలేదు. తన జోన్​లో బాల్ పడిందా దాన్ని బౌండరీకి తరలించాడు. బిగ్ షాట్స్ కొడుతూనే మధ్యలో చక్కగా స్ట్రైక్ రొటేట్ చేశాడు. అతడు బ్యాటింగ్ చేస్తుంటే పరుగులు చేయడం ఇంత సులువా అనిపించింది. ఇంగ్లండ్ బ్యాటర్లు క్యూ కట్టి ఔటై అయింది ఇదే పిచ్ మీదా అనే డౌట్ వచ్చింది. ఇక, గిల్​తో పాటు మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (100 నాటౌట్) కూడా సెంచరీతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటికే మన టీమ్ లీడ్ 40 పరుగులకు చేరుకుంది. ఈ రోజు మొత్తం బ్యాటింగ్ చేసి మూడో రోజు డిక్లేర్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టీమిండియా స్కోరు 1 వికెట్ నష్టానికి 262. మరి.. గిల్ అద్భుత శతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments