Nidhan
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఓ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. తద్వారా వన్డే వరల్డ్ కప్‌ను అతడు గుర్తుచేశాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఓ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. తద్వారా వన్డే వరల్డ్ కప్‌ను అతడు గుర్తుచేశాడు.
Nidhan
విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (209) డబుల్ సెంచరీతో చెలరేగడంతో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులు చేయగలిగింది. మిగిలిన బ్యాటర్లు అందరూ ఫెయిలైనా, టెయిలెండర్లు సహకరించకపోయినా చివరి వరకు పోరాడాడు జైస్వాల్. ఒక్కడే ఒక ఎండ్‌లో పాతుకుపోయి ఫెంటాస్టిక్ బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఇంగ్లండ్‌కు మంచి స్టార్ట్ దొరికింది. జాక్ క్రాలే (76), బెన్ డకెట్ (21) కలసి తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించారు. ఓవర్‌కు 6 పరుగుల రన్‌రేట్‌తో బ్యాటింగ్ చేశారు. పిచ్ స్లోగా ఉండటం, పెద్దగా స్పిన్‌కు అనుకూలించకపోవడం, రన్స్ ఈజీగా వస్తుండటంతో భారత్ ఒత్తిడిలో పడింది. కానీ అక్షర్ పటేల్ వేసిన డెలివరీకి క్రాలే ఔటయ్యాడు. అతడు ఇచ్చిన క్యాచ్‌ను శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు. ఇదో స్పెషల్ క్యాచ్ అనే చెప్పాలి.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో క్రాలే సూపర్బ్‌గా బ్యాటింగ్ చేశాడు. అతడు చేసిన 76 పరుగుల్లో 11 ఫోర్లు, 2 భారీ సిక్సులు ఉన్నాయి. బౌండరీలు, సిక్సర్ల ద్వారా 56 పరుగులు రాబట్టాడు క్రాలే. విధ్వంసక బ్యాటింగ్‌తో డేంజరస్‌గా కనిపించిన క్రాలేను ఓ స్టన్నింగ్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు అయ్యర్. ఆ ఓవర్లో బ్యాటర్‌ను బాగా సెట్ చేశాడు అక్షర్ పటేల్. స్పిన్ డెలివరీస్ వేస్తూ హఠాత్తుగా స్ట్రయిట్ బాల్ వేశాడు. దీంతో క్రాలే షాట్ కొట్టగా బాల్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. బంతి లెగ్ సైడ్ గాల్లోకి లేవగా వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లిన అయ్యర్ క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసి పట్టాడు. ఈ క్యాచ్‌తో రెండు వరల్డ్ కప్స్‌ను గుర్తుచేశాడు టీమిండియా స్టార్ ప్లేయర్. వన్డే వరల్డ్ కప్-2023తో పాటు 1983 ప్రపంచ కప్‌ను కూడా తన ఎఫర్ట్‌తో అయ్యర్ గుర్తుచేశాడు.
41 ఏళ్ల కింద అంటే 1983లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో అప్పటి భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ ఓ సూపర్బ్ క్యాచ్ పట్టాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో డేంజరస్ బ్యాటర్ వీవీఎన్ రిచర్డ్స్ ఇచ్చిన క్యాచ్‌ను కపిల్ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి అందుకున్నాడు. క్రికెట్ హిస్టరీలో బెస్ట్ క్యాచెస్‌లో ఒకటిగా దీన్ని చెబుతుంటారు. గతేడాది జరిగిన ప్రపంచ కప్‌లో ఇదే తరహాలో ఓ క్యాచ్ పట్టాడు ఆస్ట్రేలియా ప్లేయర్ హెడ్. గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిన బాల్‌ను కపిల్ తరహాలో వెనక్కి పరిగెత్తుకుంటూ ఒడిసి పట్టాడు హెడ్. ఆ క్యాచ్‌తో మ్యాచ్ టర్న్ అయింది. ఇవాళ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అయ్యర్ కూడా ఇదే తరహాలో క్యాచ్ పట్టి క్రాలేను వెనక్కి పంపాడు. దీంతో ఇంగ్లీష్ టీమ్ పతనం స్టార్ట్ అయింది. మరి.. అయ్యర్ పట్టిన క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
SHREYAS IYER, WHAT A CATCH. 🔥
– A game changing moment. pic.twitter.com/0P1IofmR5M
— Johns. (@CricCrazyJohns) February 3, 2024