Nidhan
ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తున్నాడు మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్. తన స్పిన్ మ్యాజిక్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్నాడు.
ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తున్నాడు మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్. తన స్పిన్ మ్యాజిక్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్నాడు.
Nidhan
ధర్మశాల ఆతిథ్యం ఇస్తున్న ఆఖరి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లతో ఆడుకుంటున్నాడు కుల్దీప్ యాదవ్. ఈ మణికట్టు మాంత్రికుడు తన స్పిన్ వేరియేషన్స్‌తో ప్రత్యర్థి జట్టును వణికిస్తున్నాడు. అతడి దెబ్బకు క్రీజులో నిలబడాలంటే బ్యాట్స్‌మెన్ భయపడుతున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇప్పటిదాకా ఇంగ్లీష్ టీమ్ 4 వికెట్లు కోల్పోగా.. ఆ నాలుగూ కుల్దీప్కే దక్కాయి. దీన్ని బట్టే అతడి బౌలింగ్ ఏ రేంజ్లో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన అన్ని వికెట్ల కంటే జాక్ క్రాలీ (79)ని అతడు ఔట్ చేసిన తీరు సూపర్బ్ అనే చెప్పాలి. స్పిన్ అంటే ఇది అనే లాంటి ఓ ఫెంటాస్టిక్ బాల్‌తో క్రీజులో పాతుకుపోయిన క్రాలీని వెనక్కి పంపాడు కుల్దీప్.
కుల్దీప్ వేసిన బాల్ ఆఫ్ స్టంప్‌కు దూరంగా పడింది. దీంతో దాన్ని భారీ షాట్ కొడదామనుకున్నాడు క్రాలీ. కానీ పడిన వెంటనే గిర్రున తిరిగిన బాల్ అతడి బ్యాట్‌ను దాటుకొని లోపలకు టర్న్ అయి లెగ్ స్టంప్‌ను గిరాటేసింది. అప్పటికే కుల్దీప్ బౌలింగ్‌లో ఒకసారి ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించున్నాడు క్రాలీ. అతడి బౌలింగ్‌లో క్రాలీ బ్యాట్‌కు తగిలి ఎడ్జ్ అయిన బంతిని సర్ఫరాజ్ ఖాన్ క్యాచ్ పట్టేశాడు. కానీ అతడు ఎంత మొత్తుకున్నా కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఎవరూ రివ్యూ తీసుకోవడానికి సపోర్ట్ చేయలేదు. అయితే రీప్లేలో క్రాలీ క్లియర్ ఔట్ అని తేలింది. దీంతో సర్ఫరాజ్ నిరాశతో ఎటూ పాలుపోక మౌనంగా ఉండిపోయాడు. అయితే ఈసారి మాత్రం అతడ్ని వదల్లేదు కుల్దీప్. ఏకంగా క్లీన్ బౌల్డ్ చేసి పడేశాడు. షాట్ కొట్టడం కాదు.. బాల్‌ను టచ్ కూడా చేయలేక కుల్దీప్ స్పిన్ వలలో పడి బిత్తరపోయాడు క్రాలీ. అసలు తాను ఎలా ఔట్ అయ్యాను, బాల్‌ను ఎలా మిస్సయ్యానో తెలియక షాకయ్యాడు.
క్రాలీ వికెట్ తీసిన కుల్దీప్.. లంచ్ తర్వాత జానీ బెయిర్‌స్టో (29)ను పెవిలియన్‌కు పంపాడు. ఒకవైపు పరుగులు రాకపోవడం, మరోవైపు వరుస విరామాల్లో వికెట్లు పడటంతో ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. బాల్ టర్న్‌తో పాటు బౌన్స్ కూడా అవుతుండటంతో స్పిన్నర్లను ముఖ్యంగా కుల్దీప్ను ఫేస్ చేయాలంటేనే వాళ్లు భయపడుతున్నారు. ఇక, క్రాలీ వికెట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ బాల్ ఏకంగా 10.9 డిగ్రీలు టర్న్ అయింది. దీన్ని చూసిన ఫ్యాన్స్.. ఇది భయ్యా స్పిన్ అంటే అని అంటున్నారు. భలే తిరిగింది బాల్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. క్రాలీని కుల్దీప్ ఔట్ చేసిన తీరుపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఓలీ పోప్ ఫన్నీ ఔట్.. అంతా ధృవ్ జురెల్ మాయా! చెప్పి మరీ..
Kuldeep Yadav – The magician 🫡
The beast for India among spinners in this series. pic.twitter.com/geaDL28593
— Johns. (@CricCrazyJohns) March 7, 2024