Nidhan
వైజాగ్ టెస్టులో భారత్ చేతిలో ఓటమిని ఇంగ్లండ్ జీర్ణించుకోలేకపోతోంది. బజ్‌బాల్‌తో కొట్టేద్దామనుకుంటే ఇలా బెండు తీశారేంటని షాక్ అవుతోంది.
వైజాగ్ టెస్టులో భారత్ చేతిలో ఓటమిని ఇంగ్లండ్ జీర్ణించుకోలేకపోతోంది. బజ్‌బాల్‌తో కొట్టేద్దామనుకుంటే ఇలా బెండు తీశారేంటని షాక్ అవుతోంది.
Nidhan
ఇంగ్లండ్‌ను చావుదెబ్బ తీసింది భారత్. ఉప్పల్ టెస్టులో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. విశాఖపట్నం ఆతిథ్యం ఇచ్చిన రెండో టెస్టులో 106 పరుగులు భారీ తేడాతో నెగ్గి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. టీమిండియా విసిరిన 399 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లీష్ టీమ్ 292 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ఓపెనర్ జాక్ క్రాలే (73) ఒక్కడే హాఫ్ సెంచరీ కొట్టాడు. మిగిలిన వాళ్లకు మంచి స్టార్ట్స్ దొరికినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా తలో 3 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. వారికి ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ సహకరించారు. వీళ్లంతా చెరో వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్ అనంతరం పేసుగుర్రం బుమ్రాపై అపోజిషన్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
బుమ్రా బౌలింగ్‌కు వస్తున్నాడంటేనే తమకు తడిసిపోతోందని స్టోక్స్ తెలిపాడు. భారత్ విసిరిన టార్గెట్‌ను ఈజీగా చేరుకుంటామని భావించామని అన్నాడు. ఇలాంటి ఛాలెంజ్‌లను స్వీకరించడం తమకు కొత్త కాదన్నాడు. ఈ తరహా మ్యాచుల్లో ఇంతకుముందు చాలా సార్లు విజయాలు సాధించామని స్టోక్స్ చెప్పాడు. ఇలాంటి మ్యాచుల్లో రాణిస్తేనే ఆటగాళ్లలోని అసలైన సత్తా బయటపడుతుందన్నాడు. ఇదే మైండ్‌సెట్‌తో గత మ్యాచ్‌లో టీమిండియాను ఓడించామని.. కానీ ఈ మ్యాచ్‌లో ఆశించిన రిజల్ట్ రాలేదన్నాడు ఇంగ్లండ్ కెప్టెన్. బుమ్రా ఓ అసాధారణ బౌలర్ అని.. అతడ్ని మెచ్చుకోకుండా ఉండలేనన్నాడు. అతడు అద్భుతంగా బౌలింగ్ చేయడం వల్లే తమ విజయావకాశాలు దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చాడు స్టోక్స్.
బుమ్రా బౌలింగ్‌కు వస్తే ఎంతటి బ్యాటర్‌కైనా వణుకు పుట్టడం ఖాయమని స్టోక్స్ పేర్కొన్నాడు. అతడ్ని ప్రశంసించకుండా ఉండటం చాలా కష్టమన్నాడు. తమ టీమ్‌లోని జేమ్స్ అండర్సన్ కూడా అసాధారణ బౌలర్ అని.. ఈ మ్యాచ్‌లో అతడు మరోమారు తన సత్తా చూపించాడని మెచ్చుకున్నాడు. అండర్సన్‌తో పాటు రెహాన్, హార్ట్లీ, బషీర్ బాగా బౌలింగ్ చేశారని స్టోక్స్ వ్యాఖ్యానించాడు. విదేశాల్లో ఎలా ఆడాలనే దానిపై కెప్టెన్‌గా ఎవరూ తనకు ఎలాంటి సూచనలు చేయలేదని ఇంగ్లండ్ సారథి వివరించాడు. భారత టూర్‌ను టాస్క్‌గా భావించామని.. తమకు అలవాటైన స్టైల్లో ఆడుతూ పోతున్నామని తెలిపాడు. 330 పరుగుల లక్ష్యం ఉంటుందని ఊహించామని చెప్పుకొచ్చాడు. బుమ్రా వల్లే తాము గెలుపునకు దూరమయ్యామన్నాడు. మరి.. బుమ్రాపై స్టోక్స్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Ben Stokes said, “Jasprit Bumrah is one of those players where you’ll put your hands up and say ‘wow, he’s just too good'”. pic.twitter.com/5iNJTDG4Up
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 5, 2024