వరల్డ్ కప్-2023 ఫైనల్లో రోహిత్ శర్మ ఔట్ అవ్వడం టీమిండియా విజయంపై ఎంత ప్రభావం చూపిందో తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఔట్ కాలేదని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అంటున్నారు.
వరల్డ్ కప్-2023 ఫైనల్లో రోహిత్ శర్మ ఔట్ అవ్వడం టీమిండియా విజయంపై ఎంత ప్రభావం చూపిందో తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఔట్ కాలేదని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అంటున్నారు.
వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడం ఫ్యాన్స్‌ను ఇప్పటికీ కలచివేస్తోంది. లీగ్ స్టేజ్‌లో అద్భుతమైన ఆటతీరుతో వరుస విజయాలు సాధిస్తూ ఈసారి కప్ మనదేనన్న భరోసాను ఇచ్చింది రోహిత్ సేన. ఎదురొచ్చిన ప్రతి అపోజిషన్ టీమ్‌పై ఈజీగా గెలుస్తూ వీర ఫామ్‌లో కనిపించింది. నాకౌట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టీమ్‌ను కూడా చిత్తుగా ఓడించి కప్పుపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచింది. అయితే ఫైనల్లో ఎదురుగా ఉన్నది ఆసీస్. 2003 ఫైనల్లో భారత్‌ను ఓడించిన టీమ్ అది. ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌కు వస్తే కంగారూ జట్టును ఆపడం ఎవరి తరం కాదు. దీంతో ఈసారి కప్ కష్టమేనా? అనే అనుమానాలు. కానీ సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ సేన ఈసారి మ్యాజిక్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
ఫైనల్లో ఒత్తిడికి లోనైన భారత్ కప్ మిస్ చేసుకుంది. వరల్డ్ కప్ ఫైనల్లో మన జట్టు ఓటమికి కారణాలు ఇవేనంటూ సీనియర్ క్రికెటర్ల నుంచి మొదలుకొని క్రికెట్ అనలిస్టుల వరకు ఏవేవో రీజన్స్ చెబుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా పెద్ద ఎత్తున చర్చలు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ ఔట్ ఒకటి ప్రధాన కారణమని చాలా మంది చెబుతున్నారు. మంచి టచ్‌లో ఉన్న హిట్‌మ్యాన్ లాస్ట్ వరకు ఆడితే భారత్ సులువుగా 300 ప్లస్ స్కోరు చేసేదని.. ఆసీస్‌కు అంత భారీ స్కోరు ఛేజ్ చేయడం కష్టమయ్యేదని అంటున్నారు. మాక్స్వెల్ బౌలింగ్‌లో రోహిత్ ఆ షాట్ కొట్టకపోయి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేదని చెబుతున్నారు.
ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అందుకుంది హిట్‌మ్యాన్ క్యాచ్ కాదని.. భారత్ నుంచి మ్యాచ్ అని కామెంట్స్ చేస్తున్నారు. మన టీమ్ మంచి దూకుడు మీద ఉన్న టైమ్‌లో బౌలింగ్‌కు వచ్చిన మ్యాక్స్‌వెల్‌పై అటాకింగ్‌కు దిగాడు రోహిత్ శర్మ. అప్పటికే అతడి ఓవర్లో 10 రన్స్ వచ్చినా మరో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. హిట్‌మ్యాన్ కొట్టిన బాల్‌ను 30 యార్డ్ సర్కిల్ నుంచి వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ అందుకున్నాడు హెడ్. అయితే ఈ క్యాచ్ ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది. రోహిత్ క్యాచ్‌ను హెడ్ సరిగ్గా అందుకోలేదని.. క్యాచ్ పట్టే టైమ్‌లో బాల్ నేలకు తాకిందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
రోహిత్ శర్మ క్యాచ్‌కు సంబంధించి పలు ఫొటోలు సోషల్ మీడియాలో ఫైరల్ అవుతున్నాయి. హెడ్ క్యాచ్ మిస్ చేసినా అంపైర్ భారత్ కెప్టెన్‌ను ఔట్‌గా ప్రకటించాడని వాదనలు వస్తున్నాయి. అయితే ఈ వివాదానికి తెరదించుతూ ఐసీసీ రియల్ ఫుటేజీని రిలీజ్ చేసింది. ఇందులో రోహిత్ క్యాచ్‌ను హెడ్ సరిగ్గానే అందుకున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ఎలా వ్యాప్తి అవుతోందో ఈ ఘటన ప్రూవ్ చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి.. రోహిత్ క్యాచ్ ఘటనపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బాధలో ఉన్న ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్! రోహిత్, కోహ్లీకి మరో ఛాన్స్!
Rohit sharma’s terrific catch by Travis Headpic.twitter.com/Bcix0gf5x4 https://t.co/R5WvFpTnBj
— b. (@coco_huhh) November 22, 2023
ROHIT SHARMA CATCH WAS DROPPED BY TRAVIS HEAD BUT THIRD UMPIRE DID NOT CHECK IT IT WAS NOT OUT💔 pic.twitter.com/uZ7mJJekE5
— Aditya Rawat (@AdityaRwt18) November 21, 2023