హైదరాబాద్ ఫ్యాన్స్​కు బ్యాడ్ న్యూస్.. భారత్-ఆసీస్ వన్డే..!

  • Author singhj Published - 02:44 PM, Thu - 9 November 23

క్రికెట్​ను ఎంతో ఇష్టపడే హైదరాబాద్ ఫ్యాన్స్​కు ఒక చేదు వార్త. భారత్, ఆస్ట్రేలియా వన్డే విషయంలో తీసుకున్న నిర్ణయం ఇక్కడి అభిమానులను బాధిస్తుందని చెప్పొచ్చు.

క్రికెట్​ను ఎంతో ఇష్టపడే హైదరాబాద్ ఫ్యాన్స్​కు ఒక చేదు వార్త. భారత్, ఆస్ట్రేలియా వన్డే విషయంలో తీసుకున్న నిర్ణయం ఇక్కడి అభిమానులను బాధిస్తుందని చెప్పొచ్చు.

  • Author singhj Published - 02:44 PM, Thu - 9 November 23

వన్డే వరల్డ్ కప్-2023లో భారత టీమ్ బ్రేకుల్లేని బుల్డోజర్​లా రయ్​మని దూసుకెళ్తోంది. మెగా టోర్నీలో ఇప్పటిదాకా ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించింది రోహత్ సేన. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, న్యూజిలాండ్ లాంటి ఫేవరెట్స్ టీమ్స్​ భారత జోరు ముందు నిలబడలేకపోయాయి. పెద్ద జట్టు అయి ఉండి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. భారత్ గెలిచిన మ్యాచుల్లో చాలా మటుకు వన్ సైడ్ అయిపోయాయని చెప్పొచ్చు. పెద్ద టీమ్స్​తోనే పరిస్థితి అలా ఉంటే.. ఇంచా చిన్న జట్ల గురించి చెప్పనవసరం లేదు. బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్, శ్రీలంకలు టీమిండియాతో మ్యాచుల్లో పూర్తిగా చేతులెత్తేశాయి.

లీగ్ దశలో మిగిలిన ఒకే టీమ్ నెదర్లాండ్స్​తో ఆదివారం జరిగే మ్యాచ్​లో పోటీపడనుంది రోహిత్ సేన. ఇందులోనూ నెగ్గి సెమీస్​కు ముందు మంచి ప్రాక్టీస్ చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే సెమీఫైనల్​ చేరుకున్నందున డచ్ టీమ్​తో మ్యాచ్ టీమిండియాకు అంత ప్రాధాన్యం కాదు. అయితే బౌలర్లు, బ్యాటర్లు తమ ఫామ్​ను మరింత మెరుగుపర్చుకునేందుకు, నాకౌట్ మ్యాచ్​కు ముందు ప్రాక్టీస్​లా ఇది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అందుకే ఈ మ్యాచ్​ను సీరియస్​గా తీసుకుంటోంది భారత్. నామమాత్రపు మ్యాచ్ కాబట్టి విరాట్ కోహ్లీ, జస్​ప్రీత్ బుమ్రా లాంటి సీనియర్లకు ఈ మ్యాచ్​లో రెస్ట్ ఇస్తారని టాక్. కోహ్లీ ప్లేసులో ఇషాన్ కిషన్​ను ఆడించొచ్చని వినిపిస్తోంది.

కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్​ల తీరు చూస్తే మాత్రం మరోలా అనిపిస్తోంది. చాలా మ్యాచుల్లో ప్రత్యర్థులను తక్కువ స్కోర్లకే ఆలౌట్ చేసినందున మన టీమ్ ప్లేయర్లు మరీ ఎక్కువగా అలసిపోలేదు. సౌతాఫ్రికాతో మ్యాచ్ తర్వాత వారం రోజుల రెస్ట్ కూడా దొరికింది. సఫారీలతో మ్యాచ్ తర్వాత రెస్ట్ దొరికింది కాబట్టి అదే టీమ్​ను కంటిన్యూ చేయాలని రోహిత్-ద్రవిడ్ భావిస్తున్నారట. వరుసగా ఆడిస్తేనే ఫామ్, రిథమ్ కంటిన్యూ అవుతుందనే ఆలోచనలో ఉన్నారట. మరి.. నెదర్లాండ్స్​తో మ్యాచ్​లో భారత టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్​కు ఓ బ్యాడ్ న్యూస్. ఈ వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా టీమ్​తో భారత్ 5 టీ20ల సిరీస్​ ఆడాల్సి ఉంది. ఇందులో భాగంగా ఆఖరి మ్యాచ్​కు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే ఉప్పల్​లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగాల్సిన చివరి టీ20ను ఇక్కడి నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి తరలించారని సమాచారం. నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భారత్-ఆసీస్ మ్యాచ్​ వేదికను భాగ్యనగరం నుంచి బెంగళూరుకు షిఫ్ట్​ను చేశారని తెలుస్తోంది. మరి.. టీమిండియా మ్యాచ్​ను హైదరాబాద్ నుంచి తరలించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియాను ఓడిస్తామంటున్న నెదర్లాండ్స్‌! ఇంత ధైర్యానికి కారణం?

Show comments