క్రికెట్‌లో సంచలనం.. కేవలం 59 బంతుల్లోనే 173 పరుగులు!

Romania vs Austria, European Cricket: క్రికెట్‌లో పెను విధ్వంసం నమోదైంది. కేవలం 59 బంతుల్లో ఓ జట్టు ఏకంగా 173 పరుగులు బాదేసింది. పైగా చివరి 11 బంతుల్లో ఏకంగా 66 పరుగులు వచ్చాయి. ఆ మ్యాచ్‌ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Romania vs Austria, European Cricket: క్రికెట్‌లో పెను విధ్వంసం నమోదైంది. కేవలం 59 బంతుల్లో ఓ జట్టు ఏకంగా 173 పరుగులు బాదేసింది. పైగా చివరి 11 బంతుల్లో ఏకంగా 66 పరుగులు వచ్చాయి. ఆ మ్యాచ్‌ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

క్రికెట్‌లో పెను విధ్వంసం నమోదైంది. ఓ టీమ్‌ 60 బంతుల్లో 162 పరుగులు చేస్తే.. మరో టీమ్‌ కేవలం 59 బంతుల్లోనే ఏకంగా 173 పరుగులు చేసింది. ఈ పరుగుల విధ్వంసం యూరోపియన్‌ టీ10 లీగ్‌లో చోటు చేసుకుంది. రోమేనియా వర్సెస్‌ ఆస్ట్రియా మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రోమేనియా 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్‌ ఇర్ఫాన్‌ హుస్సేన్‌ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగినా.. మరో ఓపెనర్‌ మొహమ్మద్‌ మోయిజ్‌తో కలిసి వన్‌ డౌన్‌లో వచ్చిన ఆరియాన్‌ మొహమ్మద్‌ పెను విధ్వంసం సృష్టించారు. ఇద్దరూ ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడుతూ.. స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా ఆరియాన్‌ అయితే.. మంచినీళ్లు తాగినంత సులభంగా సిక్సులు బాదేశౠడు. 39 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సులతో 104 పరుగులు బాది.. సూపర్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు.

అలాగే ఓపెనర్ మోయిజ్‌ 14 బంతుల్లోనే 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 42 పరుగులు చేసి అదరగొట్టాడు. మొత్తంగా 10 ఓవర్లలోనే 167 పరుగులు చేసింది. ఈ భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రియా అంతకంటే ఎక్కువ విధ్వంసం సృష్టించింది. 168 పరుగులను ఛేదించే క్రమంలో 59 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా.. ఆస్ట్రియా ఓటమిని ఒప్పుకోలేదు. ఆ జట్టు కెప్టెన్‌ అఖిబ్‌ ఇక్బాల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సుల వర్షం కురిపిస్తూ.. రోమేనియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్‌కు రోమేనియా చెత్త బౌలింగ్‌ కూడా తోడైంది.

నో బాల్స్‌, వైడ్స్‌తో ఆస్ట్రియా విజయాన్ని మరింత సులభం చేశారు రోమేనియా బౌలర్లు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రియా బ్యాటర్‌ కర్రాన్‌బీర్‌ సింగ్‌ 13 బంతుల్లో 30 పరుగులు, కెప్టెన్‌ అఖిబ్‌ ఇక్బాల్‌ 19 బంతుల్లోనే 2 ఫోర్లు, 10 సిక్సులతో 72 పరుగులు చేసి.. ఆస్ట్రియాకు ఒంటిచేత్తో విజయం అందించాడు. చివర్లో ఇమ్రాన్‌ ఆసీఫ్‌ సైతం 12 బంతుల్లో 22 పరుగులు చేసి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. రోమేనియా, ఆస్ట్రియా మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రియా చివరి 11 బంతుల్లో ఏకంగా 66 పరుగులు చేసి గెలవడం విశేషం. ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌లో రెండు నో బాల్స్‌తో పాటు నాలుగు సిక్సులు, మూడు ఫోర్లు, రెండు వైడ్లు ఇలా మొత్తం కలిపి ఏకంగా 41 పరుగుల వచ్చాయి. చివరి ఓవర్‌లో మరో సిక్సులు వచ్చాయి. మరి ఈ బ్యాటింగ్‌ విధ్వంసంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments