YS Jagan Mohan Reddy- AP Elections 2024: ఎన్నికల ప్రచారానికి CM జగన్ సిద్ధం.. పేదలే స్టార్ క్యాంపైనర్లు అంటూ..

ఎన్నికల ప్రచారానికి CM జగన్ సిద్ధం.. పేదలే స్టార్ క్యాంపైనర్లు అంటూ..

YS Jagan Mohan Reddy: అధికార పార్టీ వైఎస్సార్ సీపీ వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు.

YS Jagan Mohan Reddy: అధికార పార్టీ వైఎస్సార్ సీపీ వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కళ ఉట్టిపడుతోంది. అధికార పార్టీ దూకూడుగా వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోది. 175కి 175 అసెంబ్లీ స్థానాలు సాధించడమే లక్ష్యం అంటూ సీఎం జగన్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అలాగే అందుకు తగిన విధంగా పార్టీ సమన్వయకర్తలను కూడా నియమిస్తూ వెళ్తున్నారు. అటు లోక్ సభలో కూడా 25కి 25 స్థానాల్లో విజయమే టార్గెట్ గా అభ్యర్థుల ఎంపిక కూడా చేస్తున్నారు. నెల్లూరును క్లీన్ స్వీప్ చేసేందుకు విజయ సాయిరెడ్డిని ప్రత్యక్ష ఎన్నికలకు తీసుకొచ్చారు. ఇప్పుడు సీఎం జగన్ స్వయంగా బరిలోకి దిగబోతున్నారు. ఎన్నికలకు సంబంధించి ప్రచారం స్టార్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.

మొదటి నుంచి సీఎం జగన్.. వచ్చే ఎన్నికల్లో పేదలంతా ఒకవైపు- పెత్తందార్లు ఒకవైపు అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది పేదలకు- పెత్తందారులకు మధ్య జరుగుతున్న పోరు అని చెబుతూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో తన స్టార్ క్యాంపైనర్లు పేద ప్రజలే అంటూ మరోసారి స్పష్టం చేశారు. తాజాగా ఎన్నికల ప్రచార సన్నద్ధతపై పార్టీ ఎమ్మెల్యేతో జగన్ చర్చించారు. ఉత్తరాధి ఎమ్మెల్యేలతో జగన్ చర్చలు జరిపారు. రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేసేందుకు ప్రణాళికలు రచించారు. రానున్న 20 రోజుల్లో రోజుకు 2 లేదా 3 సభలు, రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించారు.

సభలు, రోడ్ షోలకు సంబంధించి స్పష్టమైన ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మేజర్ నియోజకవర్గాలు టచ్ అయ్యేలా ప్రచారం సాగనుంది. సభలు కూడా ఒకరోజు ఒకేచోట కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ విస్తృత చర్చరు జరిపారు. ప్రచారంలో మేనిఫెస్టోని ప్రజల్లోకి పెద్దఎత్తున తీసుకెళ్లాలని చెప్పారు. నా కల.. పేరుతో ప్రచారాన్ని ఆదివారం అధికారికంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో సిద్ధం సభ నిర్వహించనున్నారు.

ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వ లబ్ధి పొందిన పేదలే తన స్టార్ క్యాంపైనర్లు అంటూ చెబుతూనే ఉన్నారు. వారి సాక్షిగా సిద్ధం సభ నిర్వస్తున్నారు. ఈ సభకు 43 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు హాజరు కానున్నారు. ఈ సభకు మొత్తం 15 లక్షల మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇలా వైఎస్ జగన్ అభ్యర్థులు, ప్రచారం, సిద్ధం సభలు అంటూ దూకుడు ప్రదర్శిస్తుంటే.. అటు ప్రతిపక్ష కూటమి మాత్రం నత్తనడక కనిపిస్తోంది. వారికి పొత్తుతో వచ్చిన అసమ్మతిని చల్లార్చుకోవాలా? అభ్యర్థులను ఎంచుకోవాలా? అనే పనుల్లోనే బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పుడు పొత్తులోకి కొత్త పార్టీ రావడంతో మరింత మంది నేతలను బుజ్జింగించాల్సిన పని చంద్రబాబుకు వచ్చే ఆస్కారం కనిపిస్తోంది.

Show comments