Kesineni Swetha Will Resign TDP: TDPకి మరో గట్టి షాక్.. ట్విస్ట్ ఇచ్చిన కేశినేని శ్వేత

Kesineni Nani: TDPకి మరో గట్టి షాక్.. ట్విస్ట్ ఇచ్చిన కేశినేని శ్వేత

ఎన్నికల ముందు టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కేశినేని నాని పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆయన బిడ్డ కూడా అదే మార్గంలో పయనిస్తోంది. ఆ వివరాలు..

ఎన్నికల ముందు టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కేశినేని నాని పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆయన బిడ్డ కూడా అదే మార్గంలో పయనిస్తోంది. ఆ వివరాలు..

మరి కొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పార్టీలన్ని రానున్న ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి. అధికార పార్టీ.. 175కి 175 స్థానాల్లో విజయం సాధించాలని గట్టిగా నిశ్చయించుకుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక వైసీపీని ఓడించడం కోసం ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు అధికార పార్టీ విజయం వైపు అడుగులు వేస్తుండగా.. ప్రతిపక్ష టీడీపీకి మాత్రం ఎన్నికల ముందు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. రెండు రోజుల క్రితం.. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. కేశినేని నాని కుమార్తె శ్వేత టీడీపీకి షాక్ ఇచ్చారు. ఆ వివరాలు..

ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. నాని బాటలో ఆయన కూతురు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పనున్నారు. కేశినేని శ్వేత తన కార్పొరేటర్‌ పదవికి రాజీనామా చేయనున్నట్టు ఆమె తండ్రి కేశినేని నాని వెల్లడించారు. ప్రస్తుతం శ్వేత విజయవాడ 11వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఉన్నారు. అయితే, కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేస్తున్న నేపథ్యంలో తన కూతురు శ్వేత కూడా టీడీపీకి గుడ్‌ బై చెప్పనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

ఈరోజు ఉదయం 10:30 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శ్వేత తన రాజీనామా లేఖను అందజేస్తుందని నాని వెల్లడించారు. కార్పొరేటర్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా శ్వేత రాజీనామా చేస్తుందంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.

ఇదిలా ఉండగా.. తన పార్టీ ఆఫీసులో టీడీపీ జెండాలను తీసేసినట్లు కేశినాని నాని ఆదివారం ప్రకటించారు. ఈ చర్యలతో ఆయన టీడీపీతో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నట్లు అర్థం అవుతోంది. అంతేకాక తన రాజీనామాపై మరోసారి స్పందించారు కేశినేని నాని. కచ్చితంగా రాజీనామా చేస్తానని.. కాకపోతే సాంకేతిక సమస్యతో ఇది ఆలస్యం అవుతుందని, దానిపై ఇక చర్చించేది ఏమీ ఉండదని తేల్చి చెప్పారు. అంతేకాక రానున్న ఎన్నికల్లో.. కేశినేని నాని.. విజయవాడ ఎంపీగానే పోటీ చేస్తానని మరోసారి స్పష్టం చేశారు. తదుపరి ఏం చర్యలు తీసుకుంటారు.. వేరే పార్టీలో చేరతారా.. లేక స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా అన్నది త్వరలోనే తెలియనుంది.

Show comments