Ambati Rayudu: రాజకీయాల్లోకి అందుకే వస్తున్నా.. పొలిటికల్ ఎంట్రీపై రాయుడు ఆసక్తికర కామెంట్స్

  • Author Soma Sekhar Updated - 12:47 PM, Tue - 13 June 23
  • Author Soma Sekhar Updated - 12:47 PM, Tue - 13 June 23
Ambati Rayudu: రాజకీయాల్లోకి అందుకే వస్తున్నా.. పొలిటికల్ ఎంట్రీపై రాయుడు ఆసక్తికర కామెంట్స్

గత కొంతకాలంగా అటు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఇటు క్రికెట్ వర్గాల్లో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఆ వార్త దేని గురించి అంటే.. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు పొలిటికల్ ఎంట్రీ గురించి. ఓ సినిమా ఫంక్షన్లో రాయుడు పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడటంతో.. రాయుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు అన్న ఉహాగాణాలు ఊపందుకున్నాయి. వాటికి తగ్గట్లుగానే రాయుడు అడుగులు కూడా పొలిటికల్ ఎంట్రీ వైపే వేస్తున్నాడు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడంతో అంబటి రాయుడు రాజకీయ రంగప్రవేశం ఖాయం అని తెలుస్తోంది. ఇక తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో తాను రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నానో.. తన డ్రీమ్ ఏంటో చెప్పుకొచ్చాడు.

అంబటి రాయుడు.. ఐపీఎల్ చరిత్రలో తనకంటూ ఓ మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. కానీ ఆ మార్క్ తో టీమిండియాలో మాత్రం సుస్థిర స్థానం సంపాదించుకోలేకపోయాడు. దానికి అనేక కారణాలు చెప్పుకొచ్చాడు ఈ తెలుగు తేజం. తనను చాలా మంది తొక్కేయడానికి చూశారు అంటూ కొన్ని రోజులు క్రితం సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు రాయుడు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచి పోలిటికల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. గత కొన్ని రోజులుగా రాయుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడు అంటూ పెద్ద ఎంతున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఈ వార్తలకు బలం చేకూరుస్తూ.. తాజాగా ఏపీ సీఎం జగన్ ను కలిశాడు రాయుడు. దాంతో అందరు అనుకున్నట్లుగానే అతడు రాజకీయల్లోకి వస్తున్నాడు అని తేలిపోయింది. ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన రాజకీయ రంగప్రవేశం గురించి, తాను పాలిటిక్స్ లోకి ఎందుకు రావాలి అనుకుంటున్నాడో, పాలిటిక్స్ లో తన డ్రీమ్ ఏంటో చెప్పుకొచ్చాడు. రాజకీయాల్లోకి యువకులు రావాలని, వారి ఆలోచన తీరు మారాలి అని రాయుడు అన్నారు. ఇక కృష్ణ డెల్టా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం బిగ్గెస్ట్ డ్రీమ్ గా చెప్పుకొచ్చాడు అంబటి రాయుడు. ప్రస్తుతం సీఎం జగన్ మచిలీపట్నం పోర్ట్ ప్రకటించారని, దీని ద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది అని తెలిపారు.

అదీకాక కేవలం ఓ ఐటీ కంపెనీ పెట్టి అభివృద్ధి జరిగింది అంటే ఎలా అంటూ రాయుడు ప్రశ్నించారు. అభివృద్ధి ఫలాలు కింది స్థాయి ప్రజల వరకు అందినప్పుడే అది నిజమైన డెవలప్ మెంట్ అని రాయుడు పేర్కొన్నారు. సమాజంలో ఉన్న ప్రతీ వర్గం అభివృద్ధి చెందేలా చేయడమే నిజమైన రాజకీయం అని రాయుడు చెప్పుకొచ్చాడు. చివరిగా డెల్టా ప్రాంతాన్ని బంగారుమైయం చేయడమే నా కల అంటూ రాయుడు తెలిపాడు. అయితే అతడు ఎంపీగా పోటీ చేస్తాడా? లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా? అనే ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయింది. మరి రాయుడు పొలిటికల్ ఎంట్రీ చూడాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Show comments