తీవ్ర విషాదం.. ర్యాంప్ వాక్ చేస్తూ మృతి చెందిన మోడల్!

తీవ్ర విషాదం.. ర్యాంప్ వాక్ చేస్తూ మృతి చెందిన మోడల్!

ఈ మధ్య కాలంలో అకస్మాత్తు మరణాల సంఖ్య పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా.. పసి వాళ్ళ నుంచి పెద్ద వయసు వారి వరకు ఉన్నట్లుండి సడన్ గా కుప్పకూలి మరణిస్తోన్న ఘటనలు అనేకం చూశాం. అప్పటి వరకు ఏంతో ఆరోగ్యాంగా, సంతోషంగా ఉన్న వాళ్ళు.. క్షణాల వ్యవధిలో.. కళ్ళ ముందే కుప్ప కూలుతున్న ఘటనలు కోకొల్లలు. ఇలా మరణించిన వారిలో ఎక్కువ మంది గుండెపోటు కారణంగానే మృత్యువాత పడ్డారు. ఇక తాజాగా మరో విషాదకర ఘటన వెలుగు చూసింది. అందంగా ముస్తాబయ్యి.. వేదిక మీద అందంగా నడిచి వస్తోన్న మోడల్ ఉన్నట్లుండి సడన్ గా మృత్యువాత పడింది. ఆ వివరాలు..

ఈ విషాదకర సంఘటన ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలో చోటు చేసుకుంది. ఫాషన్ షో నిర్వహిస్తుండగా ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల యువ మోడల్ ఒకరు మృత్యువాత పడ్డారు. మూడు రోజుల క్రితం నోయిడా ఫిలిం సిటీలోని లక్ష్మి స్టూడియో లో ఫాషన్ షో నిర్వహించారు. ఈ క్రమంలో మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తుండగా.. పక్కనే ఉన్న లైట్ స్తంభం సడన్ గా కుప్ప కూలి.. అప్పుడే అక్కడికి వచ్చిన మోడల్ వంశిక చోప్రా మీద పడింది.

ఈ ప్రమాదం లో వంశిక తీవ్రంగా గాయపడింది. ప్రమాదం గమనించిన వెంటనే సిబ్బంది ఆమెను హాస్పిటల్ కి తరలించారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందింది అని తెలిపారు వైద్యులు. ఈ ప్రమాదంలో బాబీ రాజ్ అనే మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు వైద్యులు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. అనుమతి లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నిర్వాహకుడితో పటు మరో అలుగురిని అరెస్ట్ చేశారు

Show comments