సోషల్ మీడియా సైకోని కోర్టు ఆవరణలో చెప్పుతో కొట్టిన మహిళ!

రూాపాయి ఖర్చు లేకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో కొంత మంది కామెంట్స్ పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ.. క్షణికా ఆనందాన్ని పొందుతున్నారు. దీని వల్ల చాలా మంది బాధితులయ్యారు. ముఖ్యంగా మహిళలు..

రూాపాయి ఖర్చు లేకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో కొంత మంది కామెంట్స్ పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ.. క్షణికా ఆనందాన్ని పొందుతున్నారు. దీని వల్ల చాలా మంది బాధితులయ్యారు. ముఖ్యంగా మహిళలు..

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రోస్టింగ్ కల్చర్ ఎక్కువ అయ్యింది. కొంత మందిని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు, అసభ్యకరమైన దూషణలు, మాటల్లో చెప్పలేని విధంగా వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు. అందుకు ప్రణీత్ హనుమంత్ ఘటనే ఓ నిదర్శనం. తమను ఏం చేస్తారులే.. ఏదీ పడితే అది మాట్లాడొచ్చునని, కామెంట్స్ చేయొచ్చునని హద్దు అదుపు లేకుండా ఇష్టాను సారం ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా పాపాయిలు, యువతులు, మహిళలపై అసభ్య పదజాలాన్ని వినియోగిస్తున్నారు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఇలాంటి చెత్త కామెంట్స్ బారిన పడుతున్నారు.  మొన్నామధ్య బిడ్డ విషయంలో నిర్లక్ష్యంగా ఉందని ఓ మహిళను ట్రోల్ చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు ఒడిగట్టింది.

అయితే అందరూ తలవంచుకుని ఉంటారనుకుంటున్నారామో.. శివంగిలా తిరగబడే వాళ్లు కూడా ఉన్నారు అని నిరూపించిందో మహిళ. సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబంపై వల్గర్ కామెంట్స్ చేస్తున్నాడని ఓ వ్యక్తిని నడి రోడ్డుపై పడేసి చెప్పుతో కొట్టడమే కాకుండా. . కాలు కింద వేసి తొక్కి పడేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ కోర్టు ఆవరణలో గురువారం మధ్యాహ్నం  చోటుచేసుకుంది. స్థానికులు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతుంది.  కొన్ని రోజులుగా దెబ్బలు తిన్న వ్యక్తి సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడని, తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడని మహిళ ఆరోపించింది. ఇక తట్టుకోలేక.. పట్టుకుని చితకబాదింది.

‘ఫేస్ బుక్ లో నాపై ఇలాంటి కామెంట్స్ చేయడానికి నీకెంత ధైర్యం..  నా క్యారెక్టర్ గురించి అనే హక్కు, అధికారం నీకు ఎవడు ఇచ్చాడు‘ అంటూ చెప్పుతో పలుమార్లు కొట్టింది.   కోర్టు ఆవరణలోనే ఈ ఘటన జరగింది. అలాగే పీక మీద అడుగు వేసి తొక్కేసింది.  స్థానికులు ఈ దృశ్యాన్ని చూస్తున్నారే తప్ప.. బాధితుడ్ని కాపాడే ప్రయత్నం చేయలేదు.  అయితే తనపై విరుచుకుపడుతున్న మహిళకు క్షమాపణలు చెప్పాడు నిందితుడు.  అనంతరం బాధితురాలి భర్త కూాడా వచ్చి నిందితుడిపై దాడి చేశాడు. కోర్టు ఆవరణలోనే ఇంత జరుగుతున్నా పోలీసులు ఈ గొడవలో జోక్యం చేసుకోకపోవడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేయోచ్చు అని భావిస్తున్నవారికి ఈ ఘటన ఓ ఉదాహరణ.  ఈ ఘటనకు సంబంధించిన వీడియో బాగా సర్క్యులేట్ అయ్యింది. అయితే ఇప్పటి వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్థానిక పోలీసులు తెలిపారు.

Show comments