iDreamPost
iDreamPost
నిన్న పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అయ్యప్పనుం కోశియుమ్ మేకింగ్ వీడియోతో పాటు విడుదల కూడా 2022 సంక్రాంతికి ఫిక్స్ చేయడంతో వాతావరణం వేడెక్కింది. కారణం అదే సీజన్ ని ఆల్రెడీ మహేష్ బాబు సర్కారు వారి పాట టార్గెట్ చేయడమే. ఈ ఇద్దరూ చాలా తక్కువ సందర్భాల్లో గతంలో ఫేస్ టు ఫేస్ పోటీ పడ్డారు. బంగారం, పోకిరిలు వారం గ్యాప్ తో తలపడినప్పుడు ప్రిన్స్ భారీ మార్జిన్ తో విన్నర్ గా నిలిచాడు. అప్పటికి ఇప్పటికీ మార్కెట్ లో చాలా మార్పులు వచ్చాయి. అప్పుడు పదుల కోట్లలో ఉండే బిజినెస్ ఇప్పుడు వందలకు చేరుకుంది. థియేటర్ల కౌంట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. సో దేన్నీ తక్కువ అంచనా వేయడానికి లేదు.
Also Read: పవన్ కళ్యాణ్ – భీమ్లా నాయక్ ఆన్ డ్యూటీ!
ఇక్కడితో కథ అయిపోలేదు. వెంకటేష్ వరుణ్ తేజ్ ఎఫ్3 కూడా ఇదే బరిలో నిలిచేందుకు ఉత్సాహం చూపిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని ఈ సినిమాను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎఫ్2 కూడా వినయ విధేయ రామ, ఎన్టీఆర్ కథానాయకుడు, రజనీకాంత్ పేట పోటీని తట్టుకుని మరీ యునానిమస్ విన్నర్ గా నిలవడం మర్చిపోకూడదు. వీళ్ళే అనుకుంటే విజయ్ బీస్ట్ ను సైతం పొంగల్ రేస్ కోసం సిద్ధం చేస్తున్నారు. ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు తెలుగులోనూ విజయ్ మార్కెట్ పెరిగిపోయింది. తుపాకీతో మొదలుపెడితే మాస్టర్ తో పీక్స్ కు చేరుకుంది. సో డబ్బింగ్ అయినా సరే గట్టి పోటీ ఇవ్వడంలో ఎలాంటి అనుమానం లేదు.
Also Read: ఆలోచింపజేసిన న్యాచురల్ స్టార్
సంక్రాంతి మరీ దూరంలో ఏమి లేదు. కళ్ళు మూసుకుని అయిదు నెలలు లెక్కబెడితే వచ్చేస్తుంది. దానికి తగ్గట్టే పైన చెప్పిన సినిమాలు తమ షూటింగ్ వేగాన్ని పెంచాయి. ఆర్ఆర్ఆర్ అక్టోబర్ కే కట్టుబడి ఉంది కనక సంక్రాంతికి ఎవరు రావాలో క్లారిటీ వస్తోంది. అయితే అనుకున్నవన్నీ జరుగుతాయన్న గ్యారెంటీ కరోనా పుణ్యమాని ఏడాది నుంచి లేకుండా పోయింది. అలాంటప్పుడు ఈ నాలుగు సినిమాలు ఖచ్చితంగా బరిలో దిగుతాయా అంటే ఏమో చెప్పలేం మరి. కాకపోతే డిసెంబర్ కంతా ఫస్ట్ కాపీలు సిద్ధం చేసుకోవడం మాత్రం ఖాయం. మరి 2022 సంక్రాంతి ఏ రేంజ్ లో ఉండబోతోందో చూడాలి మరి
Also Read: తండ్రి కొడుకుల సీమ సెంటిమెంట్