పసిడి ప్రియులకు అలర్ట్‌.. నేడు స్వల్పంగా పెరిగిన ధర!

పసిడి ప్రియులకు అలర్ట్‌.. నేడు స్వల్పంగా పెరిగిన ధర!

వరుసగా మూడు రోజులుగా దిగి వచ్చి.. పసిడి ప్రియులను ఊరించిన బంగారం ధర నేడు మాత్రం.. స్వల్పంగా పెరిగింది. ఒ‍క్కసారి పెరగడం మొదలైతే.. ధర మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. కనుక బంగారం కొనాలనుకుంటున్నవారు.. ఇప్పుడే త్వరపడితే మంచిది అంటున్నారు. బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం దిగి వచ్చింది. మరి నేడు బంగారం ధర ఎంత పెరిగింది.. వెండి ధర ఎంత దిగి వచ్చింది.. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్‌ మార్కెట్లో చూసుకుంటూ.. నేడు బంగారం ధర స్వల్పంగా వంద రూపాయలు పెరిగింది. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ బంగారం ధర 10 గ్రాముల మీద ప్రస్తుతం రూ.100 పెరగ్గా రూ.53,950 వద్ద కొనసాగుతోంది. మరోవైపు 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర కూడా రూ.100 పెరిగి రూ.58,850 వద్ద ట్రేడవుతోంది.

ఢిల్లీలో కూడా పసిడి ధర పెరిగింది. ఇక్కడ కూడా 10 గ్రాముల మీద రూ.100 చొప్పున పెరిగి 22 క్యారెట్‌ గోల్డ్ రేటు రూ. 54,100 వద్ద ఉండగా.. 24 క్యారెట్‌ బంగారం ధర మాత్రం రూ.59 వేలుగా స్థిరపడింది.అయితే బంగారం, వెండి రేట్లు ఆయా ప్రాంతాలను బట్టి మారుతుంటాయనే విషయం గమనించొచ్చు. స్థానిక పన్ను రేట్లు దీనిని ప్రభావితం చేస్తుంటాయి. అందుకే హైదరాబాద్‌తో పోలిస్తే.. ఢిల్లీలో బంగారం ధర కాస్త తక్కువగా ఉంటుంది.

నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి ధర మాత్రం పతనం కావడం విశేషం. జులై 20-23 మధ్యలో హైదరాబాద్‌లో వెండి ధర కిలోపై ఏకంగా రూ.500 పతనం అయింది. ఆ తర్వాత 5 రోజుల వ్యవధిలో ఒకేసారి 1700 రూపాయలు పెరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ రెండు రోజులుగా వెండి ధర పతనమవుతూ వస్తోంది. క్రితం రోజు వెండి ధర కిలో మీద రూ.400 పడిపోగా.. ఇవాళ మరో రూ.500 పతనమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు ప్రస్తుతం రూ.74,800 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా వెండి ధర కిలో మీద రూ. 500 పతనం అయ్యి.. ప్రస్తుతం రూ.71,400 వద్ద ఉంది.

Show comments