పడిపోతున్న బంగారం ధర.. ఈ చాన్స్‌ మళ్లీ రాదు.. త్వరపడండి!

పడిపోతున్న బంగారం ధర.. ఈ చాన్స్‌ మళ్లీ రాదు.. త్వరపడండి!

నెల రోజుల వ్యవధిలో బంగారం ధర భారీగా దిగి వచ్చిన సంగతి తెలిసిందే. జూన్‌ 2 నుంచి జూలై 2 వరకు 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 2 వేల రూపాయలు దిగి వచ్చింది. ఇక ఈ నెల ప్రారంభం నుంచి బంగారం ధర పతనమవుతూనే ఉంది. క్రితం సెషన్‌లో పది గ్రాముల బంగారం ధర స్థిరంగా ఉండగా.. నేడు దిగి వచ్చింది. ఈ ఏడాది బంగారం ధర గరిష్ట రేటు పలికిన సంగతి ఎతలిసిందే. ఒకానొక దశంలో 24 క్యారెట్‌ మేలిమి బంగారం 10 గ్రాముల ధర 60 వేల రూపాయలు పలికిన సందర్బాలు కూడా ఉన్నాయి. 22 క్యారెట్‌ బంగారం ధర కూడా విపరీతంగా పెరింది. పైగా వివాహాల సీజన్‌ కావడంతో బంగారం ధర పెరుగుతూ పోయింది. కానీ ప్రస్తుతం పసిడి రేటు దిగి వస్తోంది. పైగా ఇప్పుడు ఆషాఢ మాసం కావడంతో.. ఎలాంటి శుభకార్యాలు లేవు. దాంతో పుత్తడికి గిరాకీ తగ్గి.. ధర దిగి వస్తోంది. అటు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోతుంది. మరి నేడు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధర ఎలా ఉంది.. పది గ్రాముల పసిడి రేటు ఎంత తగ్గింది అంటే…

దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి రేట్లు దిగి వచ్చాయి. నేడు హైదరాబాద్‌లో బంగారు ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్‌ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.100 పతనమైంది. ప్రస్తుతం భాగ్యనగరంలో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర రూ.54,050 వద్ద ఉంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.110 పడిపోయి.. రూ.58,960 వద్ద ట్రేడవుతోంది. క్రితం సెషన్‌లో స్థిరంగా ఉన్న బంగారం రేటు నేడు దిగి రావడం మంచి పరిణామం అంటున్నారు. అలానే దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.54,200 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్‌ బంగారం రేటు రూ.100 పతనమై రూ. 59,120 వద్ద ట్రేడవుతోంది.

దిగి వస్తోన్న వెండి ధర..

వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. నేడు వెండి ధర దిగి వచ్చింది. నేడు హైదరాబాద్‌లో వెండి ధర కిలో మీద రూ.200 తగ్గి రూ. 75,500 వద్ద కొనసాగుతోంది.ఇక ఢిల్లీలో వెండి రేటు కిలోకు ప్రస్తుతం రూ.71,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్న కారణంగానే బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగితే యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్‌కు గిరాకీ పెరిగి.. బంగారం వంటి విలువైన లోహాల ధర పడిపోతుంటుంది. అందుకే గత కొంత కాలంగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది

Show comments