కొడుకులపై నమ్మకంలేక.. బతికుండగానే పెద్దకర్మ!

కొడుకులపై నమ్మకంలేక.. బతికుండగానే పెద్దకర్మ!

కొడుకులపై నమ్మకంలేక.. బతికుండగానే పెద్దకర్మ!

సాధారణంగా ఎవరైన మరణిస్తే.. వారి కుటుంబికులు, వారసులు పెద్ద కర్మ నిర్వహిస్తుంటారు. అలానే తమ కుటుంబంలో మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని పెద్దకర్మను ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే కొందరు పుత్రులు మాత్రం తమ తల్లిదండ్రులకు ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా దారుణంగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి ఘటనలు చూసి ఓ వృద్దుడికి కూడా తన కుమారులపై అనుమానం కలిగింది. అందుకే తాను బతికుండాగనే పెద్ద కర్మ చేసుకున్నాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలోని కెవానా గ్రామానికి చెందిన జఠాశంకర్ కు మూడు పెళ్లిళ్లు జరిగాయి. అతడికి ఏడుగురు సంతానం ఉన్నారు. వ్యవసాయం చేస్తూ జఠాశంకర్  పిల్లలని పెంచి పెద్ద చేశాడు. అలానే తన బిడ్డలకు పెళ్లిళ్లు కూడా చేశాడు. అయితే ప్రస్తుతం సమాజంలో తల్లిదండ్రుల పట్ల బిడ్డలు ప్రవర్తిస్తున్న తీరు జఠాశంకర్ లో ఓ కొత్త సందేహాన్ని కలిగించింది. తన మరణానంతరం పిల్లలు పెద్దకర్మ కార్యక్రమం చేస్తారో.. లేదో అనే సందేహంతో వచ్చింది. వారు చేసినా, చేయకున్నా ఆ ముచ్చటను తానే తీర్చుకున్నాడు. తన పెద్ద కర్మ జరుపుకుంటున్నట్లు  గ్రామస్థులకు తెలియజేశాడు. శాస్త్రం ప్రకారమే పెద్ద కర్మను నిర్వహించుకున్నాడు.

అనంతరం ప్రత్యేకంగా భోజనాలు వండించి 300 మందికి చక్కటి విందును ఏర్పాటు చేశాడు. గురువారం రాత్రి జరిగిన జఠాశంకర్‌ ‘పెద్దకర్మ’కు బంధువులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై విందును ఆరగించారు. ఇక ఈ కార్యక్రమంపై జఠాశంకర్ స్పందించారు. మరణానికి ముందు ఈ కార్యక్రమం చేయడం మన ఆచారాల్లో భాగం కాదని, అయినా తాను నిర్వహించుకున్నాని ఆయన తెలిపారు. తాను ఎవరిపైనా ఎటువంటి నమ్మకం పెట్టుకోలేదన్నారు. అంతేకాక జఠాశంకర్‌ మూడేళ్ల క్రితమే తన వ్యవసాయ క్షేత్రంలో తన సమాధి కూడా సిద్ధం చేసుకోవడం మరో విశేషం.  ఇంక దారుణం ఏమిటంటే పెద్ద కర్మ జరుపుకునే కొద్ది వారాల క్రితమే తనకు తాను పిండం పెట్టుకునే కార్యక్రమాన్ని కూడా శంకర్ పూర్తి చేశాడు. మరి.. బతికుండగానే కర్మకాండలు చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం తెలియజేయండి.

Show comments