Idream media
Idream media
ప్రపంచ ధనవంతుల్లో ఒకరిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని భయపెట్టాలని ఆయన ఇంటి ఎదుట పేలుడు పదార్ధాలు నింపిన వాహనం సంచలనం సృష్టించిన సంగతి విదితమే. ముంబైలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. ఈ వ్యవహారానికి సంబంధించి కీలకంగా పథకం రచించింది ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజే అని జాతీయ దర్యాప్తు సంస్థ తన విచారణలో గుర్తించింది. సూపర్ సూపర్ కాప్ గా పాపులారిటీ తెచ్చుకోవడం కోసం అలాగే డబ్బు కోసం ఈ కుట్ర చేసాడని గుర్తించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఈ ఘటన చోటు చేసుకుంది. అంబాని ఇంటి ఎదుట జిలెటిన్ స్టిక్స్‌తో ఉన్న ఓ కారుని గమనించారు. ఆ తర్వాత విచారణ జరిపి వివాదాస్పద పోలీసు అధికారిగా ఉన్న సచిన్ వాజే సహా మరికొందరిని అదుపులోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసి ఈ వ్యవహారాన్ని బయటకు లాగింది. ఉగ్రవాదులతో ఈ ప్లాన్ చేసి ఈ కేసుని తానే టేకప్ చేసి సూపర్ కాప్ గా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేసాడని కుట్ర విఫలం అయిందని చార్జ్ షీట్ లో ప్రస్తావించారు.
అంబాని ఇంటి ముందు ఉన్న కారు వెనుకాలే ముంబయి క్రైం బ్రాంచ్‌కు చెందిన ఇన్నోవా వాహనం కూడా వచ్చిందని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఈ కేసుని తానే చేపట్టి కుట్రను దాచిపెట్టి… జాతీయ దర్యాప్తు సంస్థకు పూర్తి సమాచారం ఇవ్వలేదని గుర్తించారు. ఇక అంబాని ఇంటి ముందు ఉన్న కారుకి సంబంధించి ఉపయోగించిన నకిలీ నంబరు ప్లేట్లకు సంబంధించిన పత్రాలు అలాగే సీసీటీవీ ఫుటేజ్‌ల ఎలక్ట్రానిక్ డీవీఆర్ వంటి సాక్ష్యాలను వాజే నాశనం చేసాడని అధికారులు గుర్తించారు. ఆయా సాక్ష్యాలను ముంబయి, ఠాణెలోని పలు ప్రాంతాల్లో పడేసాడని పేర్కొన్నారు.
Also Read : ఆ దేశంలో బిట్ కాయిన్ అధికారిక కరెన్సీ
ఇక పేలుడు పదార్ధాల వాహనానికి సంబంధించి సదరు వాహనానికి సంబంధించిన యజమాని మన్‌సుఖ్ హీరేన్ హత్యకు కూడా అతనే ప్లాన్ చేసాడని గుర్తించారు. ఇద్దరూ కలిసి పని చేయగా తన కారు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఆ తర్వాత అతన్ని కూడా విచారణకు పిలవడంతో అసలు విషయం బయట పడింది. ఈ కేసు విచారణ జరుగుతున్న క్రమంలో… ఘటన జరిగిన పది రోజులకు హీరెన్ శవంగా కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించి తాను తప్పు చేయలేదని హీరెన్ చేసాడని చెప్పడానికి వాజే ప్రయత్నం చేసాడు.
అయితే ఈ విషయంలో హీరెన్ హ్యాండ్ ఇవ్వడంతో ప్రదీప్ శర్మ అనే పోలీస్ తో కలిసి అతను హత్యకు పాల్పడ్డాడు. హీరెన్ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి దొరికిపోయాడు. అంబాని ఇంటి ముందు ఉన్న వాహనంలో వాజే ఒక బెదిరింపు లేఖను పెట్టగా ఘటన జరిగిన కొన్ని రోజులకే జైషే ఉల్ హింద్ పేరుతో టెలిగ్రామ్‌లో ఒక పోస్ట్ వచ్చింది. కారు ఘటనకు తామే బాధ్యులం అని చెప్తూ జైషే ఉగ్రవాదులు ఆ పోస్ట్‌లో చెప్పినట్టుగా ఉంది. ఉగ్రవాదులను వాడుకుని అతను ఈ ప్లాన్ చేసాడని డబ్బు కోసం ప్రయత్నం చేసాడని గుర్తించారు.
Also Read : కేసీఆర్ ఢిల్లీ టూర్.. వారం రోజులుగా ఏం చేస్తున్నారు?