డిస్కో రాజా సెకండ్ ఇన్స్టాల్మెంట్

గత ఏడాది ఒక్క సినిమా విడుదల లేకుండా పోయిన మాస్ మహారాజా రవితేజ ఈ నెల 24న డిస్కో రాజాతో రాబోతున్నాడు. ఇంతకు ముందే ఒక టీజర్ విడుదల కాగా తాజాగా రెండోది రిలీజ్ చేశారు. కథకు సంబంధించిన క్లూ ఎక్కువగా ఇవ్వకుండా జాగ్రత్తగా ఈ వీడియోని కట్ చేశారు. ఎప్పటిలాగే రవితేజ ఇందులో కూడా ఫుల్ ఎనర్జీతో ఉన్నాడు. చేతిలో ఎప్పుడో పాత కాలం నాటి టేప్ రికార్డర్ ఒకటి చేతిలో పట్టుకుని సూటు బూటుతో రఫ్ మ్యానరిజంస్ తో ఫ్యాన్స్ కి నచ్చేలా ఉన్నాడు. విలన్ గా బాబీ సింహా పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. 

రెండు టీజర్లను కలిపి చూస్తే ఏదో మెడికల్ ఎక్స్ పరిమెంట్ కు గురైన రవితేజ వివిధ కాలాల్లో ప్రయాణిస్తూ తన గతానికి సంబంధించిన రివెంజ్ తీర్చుకునే పనిలో ఉన్నట్టు అనిపిస్తోంది. ఖచ్చితంగా ఇదే అని చెప్పలేం కాని మొత్తానికి హీరో పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉండబోతున్నాయనే క్లూ అయితే ఇచ్చారు
తమన్ మ్యూజిక్ మరో ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది. 

టీజర్ లోనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసింది.ఒక్క క్షణంతో నిరాశ పరిచిన దర్శకుడు విఐ ఆనంద్ దీని మీద చాలా వర్క్ చేసినట్టు ఉన్నాడు. నభ నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరొయిన్లుగా నటించిన డిస్కో రాజా సరిగ్గా ఇంకో 10 రోజుల్లో తెరమీదకు రాబోతున్నాడు. 2018లో మూడు డిజాస్టర్లు అందుకుని 2019లో పూర్తిగా గ్యాప్ తీసుకున్న రవితేజకు ఇది సూపర్ హిట్ కావడం చాలా అవసరం. అభిమానులు కూడా అదే ఆశిస్తున్నారు.
Show comments