మోనాల్‌ గజ్జర్‌ చాలా చాలా హాట్‌ గురూ!

  • Published - 06:21 AM, Tue - 8 September 20
మోనాల్‌ గజ్జర్‌ చాలా చాలా హాట్‌ గురూ!

బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో అసలు ‘షో’ షురూ అయ్యింది. నామినేషన్ల పర్వానికి తెరలేచింది. ఈ సందర్భంగా కంటెస్టెంట్స్‌ మధ్య ‘చిచ్చు’ కూడా మొదలయ్యింది. అపార్ధాలు, అసహనాలు.. అన్నీ కనిపిస్తున్నాయి. కుట్రలు, కుతంత్రాలు మామూలే. అయితే, అన్నిటికీ మించి దాదాపుగా అందరూ ‘కెమెరా ఫేవర్‌’ కోసం తహతహలాడుతున్నారు. డ్రెస్‌ సెన్స్‌ పరంగా చూసుకుంటే, ఇప్పటిదాకా ‘హాట్‌ ట్రెండ్‌’ నడుస్తున్నట్లే కన్పిస్తోంది. అందరిలోకీ హీరోయిన్‌ మోనాల్‌ గజ్జర్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా మారుతోంది. అయితే, ఆమె ‘ఏడుపు’ కొందరు కంటెస్టెంట్స్‌కి నచ్చడంలేదు. ఓపెనింగ్‌ సెర్మానీ సందర్భంగా స్టేజ్‌ మీదనే ఏడ్చేసిన మోనాల్‌ గజ్జర్‌, హౌస్‌లోకి వెళ్ళాక కూడా అదే చేసింది, చేస్తోంది కూడా. మరోపక్క, మోనాల్‌కి ఏమాత్రం తీసిపోకుండా మరికొందరు కంటెస్టెంట్స్‌ ఏడుపు మొదలు పెట్టేశారు. దీన్ని ‘ఎమోషనల్‌ కంటెంట్‌’ కేటగిరీలో తీసుకోవాలేమో. ఇదిలా వుంటే, డ్రెస్‌ సెన్స్‌ పరంగా చూసుకున్నా మోనాల్‌ చాలా ఎట్రాక్టివ్‌గా కనిపిస్తోందనే చర్చ సోషల్‌ మీడియాలో జరుగుతోంది. టాప్‌ 5 కంటెస్టెంట్స్‌లో మోనాల్‌ ఖచ్చితంగా వుండొచ్చునని అప్పుడే కొన్ని పోల్స్‌ తేల్చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో చాలా యాక్టివ్‌గా వుంటూనే, కొన్ని సందర్భాల్లో ఎమోషనల్‌ అవుతున్న తీరు, ఇతరులపై కమాండ్‌.. ఇవన్నీ మోనాల్‌కి కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. అయితే, ఈసారి హౌస్‌లో అందరూ టఫ్‌ క్యాండిడేట్స్‌ వున్నట్లే కనిపిస్తోంది. ఎవరికి వారే తమదైన వ్యూహాలతో హౌస్‌లోకి అడుగు పెట్టారు. కాగా, ఈ వారం నామినేట్‌ అయినవారిలో మెహబూబ్‌ దిల్‌ సే, గంగవ్వ, దివి, అభిజీత్‌, సుజాత తదితరులున్నారు.

Show comments