Idream media
Idream media
వైస్సార్సీపీ మొన్న ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా లో కర్నూల్ జిల్లా నుంచి ఇషాక్ భాషా పేరు చూసి రాజకీయ వర్గాలు నివ్వెరపోయాయి. ఎవరీ ఇషాక్ అంటూ గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు. అయితే ఎవరికీ ఎలాంటి సమాచారం గూగుల్ లో సంక్షిప్తమై లేదు. అలా అని పూర్తిగా అనామకుడైతే కాదు. ప్రస్తుతం నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా తనదైన రీతిలో సేవలు అందిస్తున్నాడు. నంద్యాల పట్టణం లో ఒక చిన్న పాటి వ్యాపారి గా, కుందూ రైతుగా పరిచతుడు. నాకు 30 ఏళ్లుగా సన్నిహిత మిత్రుడు.
1993 లో నాకు వివాహం అయ్యాక నేను నంద్యాల వచ్చి స్థిర పడ్డాను. నంద్యాల నడిబొడ్డున ఉన్న బాలా కాంప్లెక్స్ లో ఒక రెస్టారెంట్ నడిపే వాడు. అక్కడే రామనాథ్ టాకీస్ వెనుక కరీం భాషా అనే మోటార్ సైకిల్ మెకానిక్ ఉండేవాడు. ఆ పక్కనే మా సమీప బంధువు నరెద్దుల శ్రీనివాస్ రెడ్డి కి చెందిన శ్రీనివాసా ఆటో మొబైల్స్ దుకాణం ఉండేది. నంద్యాల లో ఉన్న నా లాంటి ద్విచక్ర వాహన చోదకులందరికి సాయంత్రం పూట కబుర్లు చెప్పుకునేందుకు ఇదే రాజధాని గా ఉండేది. రెస్టారెంట్ నడిపే ఇషాక్ తరుచూ అక్కడ కూర్చొని మాతో ముచ్చటించే వాడు. ఆ విధంగా జరిగిన పరిచయం. నేను ఈనాడు, ఆంధ్ర జ్యోతి లలో పని చేసేటప్పుడు మా స్నేహం మరింత సన్నిహితంగా మారింది. రెస్టారెంట్ వ్యాపారం వదిలేశాక ఇషాక్ వేరే వ్యాపారం ఏదో చేసే వాడు గాని ఆ వివరాలు ఎప్పుడూ అడగలేదు.
గ్రాడ్యుయేట్ అయిన ఇషాక్ తొలుత డిష్ కనెక్షన్స్ వ్యాపారం కూడా చేశాడు. సౌత్ ఇండియా లోనే రెండో డిష్ ఇతడిదే. వాళ్ళ పూర్వీకులు మద్రాస్ జాడి బీడీల పేరు తో ఒక కంపెనీ నడిపారు. పొగాకు వ్యాపారం కూడా చేశారు.
Also Read : Mlc,Raghu Raju – రఘురాజు కష్టానికి దక్కిన ఫలితం
కలిసినప్పుడల్లా, మా మధ్య రాజకీయ పరమైన చర్చ లే నడిచేవి. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గా ఉండేవాడు. వైస్సార్సీపీ లో నంద్యాల పట్టణ మైనారిటీ నాయకుడు గా ఉన్నాడు. రెండు దశబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్నప్పటికీ మాజీ మంత్రి NMD ఫరూక్ వంటి stalwart ముందర ఆ వర్గం లో తగిన గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు.
ఇషాక్ కు పదవి వెనుక నేపథ్యం ఇది…
సామాన్య కార్యకర్తగా ఉన్న ఇషాక్ దశ తిరిగే అవకాశం అనుకోకుండా వచ్చింది. భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో నంద్యాలకు బై ఎలక్షన్స్ వచ్చాయి. రెండు నెలల ముందు నుంచే అధికార టీడీపీ రంగం లోకి దిగి నంద్యాల లో కనిపించిన ప్రతి నాయకుడికి ఎర వేయ సాగారు. పదవో, ఫలమో, లక్ష్మమో ఏదో ఒక ఆశ పెట్టడం, బుట్ట లో వేసుకోవడం… టీడీపీ కి రోజూ ఇదే తంతు. ఇషాక్ కు కూడా తాయిలాలు ముట్టజీప్పే ప్రయత్నం జరిగింది. అయితే, అప్పటికే శిల్పా కుటుంబం తో వచ్చిన సాన్నిహిత్యం తోడు వై ఎస్ పై ఉన్న అభిమానం తో ఇషాక్ పార్టీ నే నమ్ముకొని తిరిగాడు.
ఉప ఎన్నికల వేడి పుంజుకున్నాక వై ఎస్ జగన్ నంద్యాల ఎస్ పి జి మైదానంలో పెట్టిన బహిరంగ సభ లో ప్రసంగిస్తు.. మా పార్టీ తరుపున ఎమ్మెల్యేల ఓట్ల quota లో రానున్న ఒకే ఒక ఎంమ్మెల్సీ పదవిని నంద్యాల మైనారిటీ వర్గానికే ఇస్తాను అని ప్రకటించాడు. అప్పటికి ఆ స్థాయి మైనారిటీ నాయకుడు ఎవరూ నంద్యాల వైస్సార్సీపీ లో లేరు. దీంతో అందరి ద్రుష్టి ఇషాక్ పై పడింది. కాబోయే ఎమ్మెల్సి గా మేమంతా పిలవటం మొదలు పెట్టాం. ఉప ఎన్నికల సందర్బంగా టీవీ చర్చా వేదికల్లో టీడీపీ మైనారిటీ లీడర్స్ ను ఢీ కొట్టేందుకు నేను, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి లాంటి మిత్రులం ఇషాక్ ను ప్రోత్సాహంచే వాళ్ళం.
Also Read : Ycp,MLC ఫలించిన వంశీకృష్ణ నిరీక్షణ
ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికి తెలుసు. చరిత్ర లో కనీ విని ఎరుగని ఎత్తులు, జిత్తులు, తాయెత్తుల మధ్య టీడీపీ గెలిచింది. కొన్ని సమీకరణల వల్ల ఇషాక్ కు రావాల్సిన ఎమ్మెల్సీ పదవి మాజీ ఐ పి ఎస్ ఇక్బాల్ గారిని వరించింది. దీనికి తోడు వైస్సార్సీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి గా ఉన్న ఇషాక్ కు 2020 మార్చి లో మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నామినేటెడ్ పదవి రావడం తో ఎమ్మెల్సీ పదవి పై ఆశలు సన్నగిల్లాయి.
ఇషాక్ భాయ్ ఎలా feel అయ్యేవాడో గానీ, సన్నిహితులు అందరం “ఎమ్మెల్సీ గారూ ” అనే సంభోదిస్తూ వచ్చాం. అయితే, మొన్న పార్టీ ప్రకటించిన జాబితా లో ఇషాక్ భాయ్ పేరు కూడా వెల్లడి కావడం తో ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి గా మారిపోయాడు. ఎమ్మెల్యే ల quota కాబట్టి ఇషాక్ భాయ్ ఎన్నిక లాంచనమే. ఎప్పటి మాదిరే ఈ రోజు కూడా అతి సాధారణం గా కలిశాం.
జగనన్న మాట ఇచ్చాడంటే అది నెరవేర్చి తీరుతాడు అని, నా జీవితం అంతా జగనన్న కు, శిల్పా సోదరులకు ఋణపడి ఉంటాను అని ఇషాక్ చెప్పాడు.
Also Read : MLC, Murugudu Hanumantha Rao – జగన్ హామీ.. మురుగుడుకు కలిసొచ్చింది
ఇప్పుడు ఇషాక్ భాయ్ కాబోయే ఎమ్మెల్సీ.. ఒక సామాన్యుడైన అసామాన్యుడు. ప్రతి దానికి తన చిరునవ్వు తోనే సమాధానం ఇచ్చే ఇషాక్ ప్రజా సేవ లో మంచి పేరు తెచ్చుకోవాలి అని అభిలాషిస్తూ..
– Guest Writer – Kasipuram Prabhakar Reddy