కేటిఆర్ ఉద్యోగం ఇచ్చారు సరే, కాని ఆమె జీవితంలో ఉన్న మరో పెద్ద కష్టం ఏంటీ…?

ఉన్నత చదువులు చదివి… చదువులో మంచి ప్రతిభ కనబరిచి, మంచి ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఎందరో ఉన్నారు. వారి ప్రతిభను ఎవరూ గుర్తించక, బ్రతుకు జీవుడా అంటూ ఏదో కాయా కష్టం చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఒక మహిళకు తెలంగాణాలో కేటిఆర్ రూపంలో బంగారు భవిష్యత్తు పలుకరించింది. ఎమ్మెస్సీ ఫస్ట్‌క్లాస్‌లో పాసై జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా రజనీ అనే మహిళ పని చేస్తున్నారు. దీనిపై ఒక ప్రముఖ పత్రిక ప్రత్యేక కథనం ప్రచురించింది. సోషల్ మీడియాలో కూడా దీనికి మంచి స్పందన వచ్చింది.

ఆమె భవిష్యత్తుకి ప్రభుత్వమే మంచి మార్గం చూపించాలని కోరారు. ఇది మంత్రి కేటిఆర్ దృష్టికి వెళ్ళడంతో ఆమెకు ఒక అవకాశం కల్పించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే… జీహెచ్‌ఎంసీలో ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ ఎంటమాలజిస్ట్‌గా ఆమెకు ఉద్యోగం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ లో అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ఆమెకు ఉద్యోగం ఇచ్చినట్టుగా తెలిపారు. మంత్రి చేసిన ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ… “విరామం లేకుండా గడుపుతున్న నాకు ఇదొక ఉత్తమమైన సందర్భం అని పేర్కొంటూ ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు.

Also Read: అఖాడా పరిషత్ మహంత్ నరేంద్ర గిరి,సహజ మరణమేనా?

ఇలా ఆమెకు ఉద్యోగం రావడంతో మంత్రి కేటిఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. అసలు ఆమె ఎక్కడి వారు, ఏంటీ అనేది చూస్తే… వరంగల్‌ జిల్లా పరకాల ఆమె సొంత ఊరు. పేద కుటుంబం అయినా సరే మంచి ఉద్యోగం వస్తుంది అనే ఆశతో కూలి నాలీ చేసుకుని తల్లి తండ్రులు ఆమెను మంచి చదువు చదివించారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం చూపిస్తూ… ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ చేసి ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యారు ఆమె. 2013లో పీజీ పూర్తయ్యాక, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీకి అర్హత కూడా సాధించడం గమనార్హం.

ఇక ఆ తర్వాత ఆమెకు వివాహం చేసారు. ఆమె భర్త న్యాయవాదిగా ఉన్నా సరే కుటుంబం మాత్రం కష్టాల్లోనే ఉంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టగా వారి ఆలనా పాలనా చూస్తూ పోటీ పరిక్షలు రాస్తూ… ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే క్రమంలో ఆమె భర్తకు గుండె జబ్బు ఉందని గుర్తించారు. ఆరోగ్య శ్రీ కింద వైద్యం చేయించి మూడు సార్లు స్టంట్ లు వేయించగా… అనారోగ్య కారణాలతో ఆయన ఉపాధి కోల్పోయారు. భర్తను, ఇద్దరు పిల్లలను చూస్తూ ఆమె పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు.

ఇదే క్రమంలో కూరగాయల వ్యాపారం కూడా చేస్తూ బ్రతుకు బండిని ముందుకు నెట్టుకొచ్చారు. ఆమెకు కార్మికురాలిగా పది వేలు రాగా ఆ సొమ్ముతోనే కుటుంబాన్ని ఆమె ముందుకు నడిపించారు. ఈ తరుణంలో ఆమె జీవితం గురించి ఒక ప్రముఖ పత్రిలో రావడం తో ఆమెకు మంత్రి కేటిఆర్ ఉద్యగం ఇప్పించారు. ఏది ఎలా ఉన్నా సరే ఆమె జీవితం నేడు గాడిలో పడినట్టు కాదని ఆమె భర్తకు కూడా మంచి వైద్యం అందించి చిన్నారులకు మంచి విద్యను అందిస్తే బాగుంటుంది అని కోరుతున్నారు.

Also Read: వైఎస్సార్ సీపీ జైత్రయాత్ర.. ఏ అంశాలు కలిసొచ్చాయి?

Show comments