Special Status -ప్ర‌త్యేక హోదాపై ప‌ట్టువీడ‌ని జ‌గ‌న్

ఏపీ అభివృద్ధికి అత్యంత అవ‌స‌ర‌మైన‌ది ప్ర‌త్యేక హోదా. ఆ హోదా ఉంటే 90 శాతం నిధులను కేంద్రం కేటాయిస్తుంది. అందుకే హోదా కోసం యావత్ రాష్ట్రం ఎదురుచూస్తోంది. న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్‌కు రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం కూడా దాని కోసం పార్ల‌మెంట్ లోనూ, బ‌య‌ట పోరాటం సాగిస్తోంది. 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ, టీడీపీ, జనసేన ప్ర‌త్యేక హోదా సాధిస్తామ‌ని మూకుమ్మ‌డిగా హామీ ఇచ్చాయి. చంద్ర‌బాబు అయితే, అది నా బాధ్య‌త అన్నారు. కానీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్యాకేజీ కోసం హోదాను తాక‌ట్టు పెట్టారు. అది ముగిసిన అధ్యాయ‌మ‌ని గ‌తంలో బీజేపీ పేర్కొంది. కానీ వైసీపీ ప్ర‌భుత్వం మాత్రం 2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేర‌కు హోదా కోసం ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. ఏపీకి స్పెష‌ల్ స్టేటస్ సాధించేందుకు సీఎం జ‌గ‌న్ రెండేళ్లుగా ప్ర‌య‌త్నాలు సాగిస్తూనే ఉన్నారు. కేంద్రం ఎటువంటి వివ‌ర‌ణ‌లు ఇస్తున్నా, స‌హేతుక‌మైన కార‌ణాలు చెబుతూ హోదా కోసం ప‌ట్టుబ‌డుతూనే ఉన్నారు. తాజాగా కూడా త‌న క‌ర్త‌వ్యం నెర‌వేర్చారు

ఏపీలో జ‌రిగిన సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం వేదిక‌గా మ‌రోసారి ప్ర‌త్యే క హోదా అంశం లేవ‌నెత్తారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఈ సమావేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పలు కీలక అంశాలపై ప్రస్తావించారు. ఆయన ప్రస్తావనకు తెచ్చిన అంశాలపై కేంద్ర మంత్రి, సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అమిత్ షా స్పందించి.. హామీ ఇచ్చారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలు రెండు రాష్ట్రాలవే కాదని.. ఇవి జాతీయ అంశాలని షా పేర్కొన్నారు. అంతేకాదు.. జగన్ ప్రస్తావించిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని.. తప్పకుండా వీటన్నింటికీ పరిష్కారం చూపుతామని ఈ సభాముఖంగా అమిత్‌ షా హామీ ఇవ్వ‌డం సంతోష‌క‌ర విష‌యం.

‘ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేయాలి.. విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా హామీలు అమలుకాలేదు. ఇది విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే. రీసోర్స్‌ గ్యాప్‌నూ భర్తీ చేయలేదు. తెలంగాణ నుంచి విద్యుత్‌ బకాయిలను ఇప్పించాలి. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరటనివ్వాలి. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలి. రేషన్‌ లబ్ధిదారుల గుర్తింపుపై కేంద్రం ప్రక్రియలో హేతుబద్ధత లేదు. దీనిపై వెంటనే సవరణలు చేయాలి’ అని సమావేశంలో కీలక అంశాలను జగన్‌ ప్రస్తావించిన‌ట్లు తెలిసింది. ఏపీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ముఖ్య‌మంత్రి చేసిన విన‌తుల‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అమిత్ షా హామీ ఇచ్చారు.

Also Read : Southern Council Amit Sha -దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం, జగన్ ఎజెండా ఇదే

Show comments