Hyderabad-Ayodhya Ram Mandir Live Photos Fraud: అయోధ్య రామమందిర్ లింక్స్ తో భారీ మోసం! క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ!

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర్ లింక్స్ తో భారీ మోసం! క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ!

Ayodhya Ram Mandir Live Photos Fraud: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో హైదరాబాద్‌ సైబర్‌ వింగ్‌ పోలీసులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. ఆ వివరాలు.. ​

Ayodhya Ram Mandir Live Photos Fraud: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో హైదరాబాద్‌ సైబర్‌ వింగ్‌ పోలీసులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. ఆ వివరాలు.. ​

నేటి కాలంలో సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. డిజిటలైజేషన్‌ పెరుగుతున్న కొద్ది.. మోసం చేసే విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. ఓటీపీ మొదలు ఆన్‌లైన్‌ డెలివరీ వరకు జనాలను ఎన్ని రకాలుగా మోసం చేయాలో.. అన్ని విధాలుగా మోసం చేస్తున్నారు. నిరక్షరాస్యులు మాత్రమే కాక.. బాగా చదువుకున్నవారు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తోన్న వారు సైతం సైబర్‌ ఫ్రాడ్స్‌ వలలో చిక్కుకుని.. లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయోధ్య రామ మందిరం పేరు మార్మొగిపోతుంది. అయితే సైబర్‌ నేరగాళ్లు దీన్ని కూడా వదలడం లేదు.

అయోధ్య దర్శనాలు, ప్రసాదాల పేరతో ఇప్పటికే మోసాలకు తెర తీశారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌ సైబర్‌ వింగ్‌ పోలీసులు జనాలకు కీలక అలర్ట్‌ జారీ చేశారు. జనవరి 22న సైబర్‌ నేరగాళ్లు రెచ్చి పోయే ప్రమాదం ఉన్నందున అనుమానాస్పదంగా ఉన్న మెసేజ్‌లు, లింక్‌లు ఒపెన్‌ చేయవద్దని సూచించారు. ఈ మేరకు వారు ట్వీట్‌ చేశారు. ఆ వివరాలు..

తాజాగా హైదరాబాద్‌, సైబర్‌ వింగ్‌ పోలీసులు కీలక ప్రకటన చేశారు. జనవరి 22, 2024 నాడు అయోధ్య రామ మందిర ప్రాంరభోత్సవం, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సైబర్‌ నేరగాళ్లు.. అయోధ్య లైవ్‌ ఫొటోలు, ఆ తరహా ఇతర పేర్లతో జనాలను మోసం చేసేందుకు రెడీ అవుతున్నారని హెచ్చరించారు. కనుక అయోధ్య మందిర ప్రారంభోత్సవం రోజున మీ మొబైల్స్‌కి వచ్చే ఈ తరహా లింక్‌లను ఒపెన్‌ చేయవద్దని సూచించారు.

పొరపాటున మీరు గనక ఈ లింక్‌లను ఒపెన్‌ చేస్తే. మీ బ్యాంక్‌ ఖాతా, ఫోన్‌ హ్యాక్‌ అయ్యే అవకాశం ఉందన్నారు. అదే జరిగితే మీ అకౌంట్‌ ఖాళీ అవుతుందని హెచ్చిరంచారు. ఈ మెసేజ్‌ను మీకు తెలిసిన వారందరికి పంపి జాగ్రత్తగా ఉండమని సూచించారు హైదరాబాద్‌ సైబర్‌ వింగ్‌ పోలీసులు.

ఇప్పటికే అయోధ్య ప్రసాదం పేరిట అమెజాన్‌లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయోధ్య ప్రసాదం అని చెప్పి నకిలీ లడ్డులను అమెజాన్‌ అమ్మకానికి పెట్టింది. ఇది గుర్తించిన కేంద్రం అమెజాన్‌ సంస్థకు నోటీసులు జారీ చేసింది. కాన్ఫెడరేషన్ అఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్‌కు ఈ విషయమై పిర్యాదు చేసింది. వెంటనే అధికారులు అమెజాన్ కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నోటీసులు జారీ చేసింది. అమెజాన్‌ తన వెబ్‌సైట్‌లో సాధారణ దూద్‌పేడ స్వీట్‌లను.. అయోధ్య ప్రసాదం పేరుతో విక్రయిస్తూ జనాలను మోసం చేస్తుంది. దీనిపై నోటీసులు జారీ చేసిన కేంద్రం ఏడు రోజుల్లో అమెజాన్‌ వివరణ ఇవ్వాలని కోరింది.

Show comments