చింతమనేనికి చివరికి దొరికింది

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. అయన పై నమోదైన18 కేసుల్లో బెయిల్‌ మంజూరైంది. ఈ ఏడాది ఆగస్టు 29న పెదవేగి మండలం పినకడిమికి చెందిన చెరుకు జోసె్‌ఫపై దాడి చేసి కులం పేరుతో దూషించారన్న అభియోగంతో పెదపాడు పోలీ్‌సస్టేషన్‌లో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. దీంతో సెప్టెంబర్‌ 11న పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.

ఆ తర్వాత పీటీ వారెంట్‌పై మరో 17 కేసుల్లో అరెస్టు చేశారు. ఒక కేసు తర్వాత మరో కేసు పై అయన జైల్లో ఉండాల్సి వచ్చింది. అప్పటి నుంచి చింతమనేని ఏలూరులోని జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. నేడు శనివారం జిల్లా జైలు నుంచి చింతమనేని విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇటీవల చంద్రబాబు తనయుడు నారా లోకేష్ జైలు లో చింతమనేని ని పరామర్శించారు.

Show comments