వాలంటీర్ల పై మళ్లీ నోరు పారేసుకున్న చంద్రబాబు

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో, లాక్‌డౌన్‌ సమయంలో పేద ప్రజలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు వాలంటరీ లు చేస్తున్న కృషిని దేశమంతా కీర్తి స్తోంది. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ మీడియా వాలంటీర్ల సేవలను కొనియాడుతున్నారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కనిపించనట్లుగా ఉన్నాయి. కరోనా ఆపత్కాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇంటింటి సర్వే లు, ప్రజలకు నిత్యావసరాలు, పింఛన్లు పంపిణీ చేస్తున్న వాలంటీర్ల పై చంద్రబాబు మళ్లీ నోరు పారేసుకున్నారు. వాలంటీర్లు నాటుసారా కాసి ఇంటింటికి వెళ్లి అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు.

వాలంటీర్ల పై చంద్రబాబు నోరు పారేసుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ వాలంటీర్ల పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో మగాళ్లు లేనప్పుడు వాలంటర్లు వెళ్లి డోర్లు కొడుతున్నారంటూ అసభ్యంగా మాట్లాడి అవమానపరిచారు. మూటలు మోసే వాళ్ళు అంటూ హేళన చేశారు. 5 వేలకు పని చేసే వారికి పిల్లను ఎవరు ఇస్తారని వ్యాఖ్యానించారు.

గ్రామ స్థాయిలో రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలు పార్టీలకతీతంగా వాలంటీర్లు అందిస్తున్నారు. ఈ విషయం క్షేత్రస్థాయిలో ఉన్న టిడిపి నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. అర్హుల గుర్తింపు, దరఖాస్తు, లబ్ధిదారుల ఎంపిక, పథకాలు డెలివరీ ఇవన్నీ కూడా వాలంటీర్లు నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా ప్రతి నెల ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తున్నారు.

కరోనా నియంత్రణ కోసం ఇప్పటికే మూడు సార్లు ఇంటింటి సర్వే చేశారు. ఆ సర్వే ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపడుతోంది. రెడ్ జోన్లలో ఇంటికి వెళ్లి నిత్యావసరాలు, కూరగాయలు వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. ఇంతటి అమూల్యమైన సేవలు అందిస్తున్న వాలంటీర్ల పై 70 ఏళ్ల వయసున్న చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన హుందాతనాన్ని ఏమాత్రం పెంచదనడంలో సందేహం లేదు.

Show comments