రేషన్‌ కార్డు ఉన్న వారికి కేంద్రం శుభవార్త.. రేషన్‌తో పాటు ఆ సేవలు కూడా ఫ్రీ!

రేషన్‌ కార్డు ఉన్న వారికి కేంద్రం శుభవార్త.. రేషన్‌తో పాటు ఆ సేవలు కూడా ఫ్రీ!

రేషన్‌ కార్డు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రేషన్‌ కార్డు ఉన్న వారికి ఉచిత రేషన్‌తో పాటు.. ఉచిత చికిత్స పొందే అవకాశం కల్పించనుంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. అంత్యోదయ కార్డు ఉన్నవారికి ఉచిత రేషన్‌తో పాటు.. ఉచిత వైద్యం సౌకర్యం అందిచనున్నారు. అంత్యోదయ కార్డులు ఉన్నవారందరికి ఆయుష్మాన్‌ కార్డులను ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోం. దీని వల్ల ఇక పేదలు ఉచిత వైద్య సౌకర్య పొందేందుకు అవకాశం లభించనుంది. ఇక ప్రభుత్వం అందించే ఉచిత సౌకర్యం చాలా కేంద్రాల్లో అందుబాటులో ఉంది.

ఆయుష్మాన్ కార్డు కావాల్సిన వారు.. తమ రేషన్ కార్డును పబ్లిక్ కన్వీనియన్స్ సెంటర్‌లో చూపించి దరఖాస్తు చేసుకోవచ్చు. అంత్యోదయ కార్డు హోల్డర్ల కోసం ఆయుష్మాన్ కార్డును తయారు చేయాలని ఆదేశించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అంత్యోదయ కార్డులు ఉన్న వారి పేరు మీద ఆయుష్మాన్‌ కార్డుల తయారీ కూడా పూర్తైనట్టుగా సమాచారం.

Show comments