iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చెప్పినప్పటి నుంచి ఏపీలో బీజేపీని పరిగెత్తించాలని సోము వీర్రాజు ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ అజెండా కన్నా సొంత అజెండాతో పనిచేస్తున్నారన్న ఆరోపణలు, పదవి గడువు ముగియటం తదితర కారణాలతో కన్నా లక్ష్మీనారాయణను తప్పించి సోము వీర్రాజుకు బీజేపీ అధిష్టానం రాష్ట్ర బాధ్యతలు ఇచ్చింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కన్నా దూకుడుగా వెళ్లాలన్న ఆలోచనో లేకుంటే అధిష్టానం వద్ద మంచి పేరు తెచ్చుకోవాలన్న కోరికో కానీ కొన్నిసార్లు ఏకపక్షంగా నిరాధారంగా మాట్లాడటం, ఆరోపించడం సోము వీర్రాజుకు అలవాటుగా మారుతుంది.
పోలవరం ముంపు ప్రాంతంలోని తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపితేనే ప్రమాణస్వీకారం చేస్తాను అని చెప్పాను అందుకే ఆ మండలాలను ఆంధ్రాలో కలిపారని చంద్రబాబు కొన్ని వందలసార్లు చెప్పుకున్నా నాటి బీజేపీ అధ్యక్షుడు చంద్రబాబు క్రెడిట్ తీసుకోవటాన్ని ఖండించలేదు. సోము వీర్రాజు ఆ ఫైల్ నేను తీసుకెళ్ళాను అని చెప్పుకున్నా మీడియాలో పెద్దగా కవరేజీ రాలేదు.
అయితే నేడు తాజాగా, భద్రాచలాన్నీ ఆంధ్రాలో కలపకపోవటం వలన దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ఆగిపోయి రాయలసీమకు నష్టం వచ్చిందని సోము వీర్రాజు ఆరోపించారు. నాడు కేంద్రంలో అధికారములో ఉన్నది బీజేపీ, రాష్టంలో అధికారములో ఉన్నది దాని మిత్రపక్షం టీడీపీ. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రాలో కలిపే ఫైల్ ను పీఎంఓ క్లియర్ చేయించానని చెప్పుకున్నది సోము వీర్రాజు.. అదే ఫైల్లో భద్రాచలాన్ని ఎందుకు పెట్టలేదు సమాధానం చెప్పవలసింది ఎవరు? నాడు భద్రాచలాన్ని పట్టించుకోకుండా నేడు ఆరోపణలు చేయటం సోము వీర్రాజు ఎలా సమర్ధించుకుంటారు?
రాజశేఖర్ రెడ్డి మానసపుత్రిక దుమ్ముగూడెం-టైల్ పాండ్ ప్రాజెక్ట్. ఆయన హయాంలోనే గోదావరి మిగులు జలాలను దుమ్ముగూడెం నుంచి నాగార్జున సాగర్ దిగువున టైల్ పాండ్ లోకి మళ్లించే పనులు మొదలయ్యాయి,టైల్ పాండ్ పూర్తయ్యింది కూడా. విభజన సమయంలో దుమ్ముగూడెం-టైల్ పాండ్ ప్రాజెక్టు కు కూడా జాతీయహోదా ఇవ్వమని జగన్ డిమాండ్ చేశారు. విభజన చట్టంలో కూడా విభజన నాటికి పనులు జరుగుతున్నా ప్రాజెక్టులన్నింటినీ కొనసాగించాలని చెప్పారు అయినా కానీ కెసిఆర్ దమ్ముగుడెం-టైల్ పాండ్ ప్రాజెక్ట్ ను కేవలం ఖమ్మం జిల్లాకు కుదించి సీతారాం ఎత్తిపోతల పథకం చేపట్టినా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గాని,ఆంధ్రా బీజేపీ నేతలకు కానీ మాట్లాడలేదు.
పట్టిసీమ పేరుతో పోలవరాన్ని ముంచినా కానీ ఆంధ్రా బీజేపీ నాయకత్వం మాట్లాడలేదు. సోము వీర్రాజు పట్టిసీమ మీద చేసిన వ్యతిరేక వ్యాఖ్యలు సొంత పార్టీ వారే పట్టించుకోలేదు. ఇపుడు దుమ్ముగూడెం మీద విమర్శలు చేసే బదులు తాము ప్రధాని,కేంద్ర జలవనరుల శాఖ మంత్రులతో మాట్లాడి దుమ్ముగూడెం పనులు మొదలుపెట్టిస్తే బాగుంటుంది. తెలంగాణలోని దమ్ముగూడెం విషయంలో సోము వీర్రాజు మాట చెల్లదనుకుంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ కరువు సమస్య పరిష్కారానికి తలపెట్టిన రాయాలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు NGT ,కేంద్ర జలవనరుల శాఖ వైపు నుంచి ఉన్న ఆటంకాలు తొలగించటానికి సోము వీర్రాజు కృషిచేయటం రాష్ట్రానికి ఉపయోగం.
నిన్న బడ్జెట్ లో పోలవరం ప్రస్తావనే లేదు. జగన్ ముఖ్యమంత్రి అయినా తరువాత రివర్స్ టెండర్ తో ఖర్చు తగ్గించి పనులను యుద్ధప్రాతిపదికన జరిగేలా చూస్తున్నారు. పోలవరం కోసం రాష్ట్రం పెట్టిన ఖర్చుకు సంబంధించి బకాయిలు, రావలసిన నిధులను రాబట్టడానికి సోము వీర్రాజు కృషి చెయ్యాలి.. అంతేకాని పుణ్యకాలం ముగిసే వరకు చూస్తూ ఉండి ఇప్పుడు దుమ్ముగూడెం గురించి ముఖ్యమంత్రిని విమర్శించటం వలన రాష్ట్రానికి లాభం లేదు, బీజేపీకి కూడా రాజకీయంగా లాభం లేదు.