అందరికి కృతఙ్ఞతలు – సమ్మె యధాతధం

 తెలంగాణ బంద్‌కు మద్దతిచ్చిన అన్ని వర్గాలకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ బంద్‌ సంపూర్ణంగా విజయవంతం అయిందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తున్నవారిని అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. అరెస్ట్‌ చేసినవారిని బేషరతుగా విడుదల చేయాలని అశ్వత్థామరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ సమ‍్మె యథావిథిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Show comments