‘సీటీమార్’తో పోటీకి ‘సుల్తాన్’ సై

ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నా విడుదల తేదీల విషయంలో హీరోల మధ్య క్లాష్ తప్పడం లేదు. సంక్రాంతి తర్వాత బంగారంలా కనిపిస్తున్న వేసవిని వదులుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. అందుకే ఒకే రోజు రెండు మూడు రిలీజ్ కాక తప్పని పరిస్థితి నెలకొంది. దీని వల్ల రెవిన్యూ తగ్గుతుందని తెలిసినా కూడా సై అంటే సై అనే సవాలుకే సిద్ధమవుతున్నారు. తెలుగు స్ట్రెయిట్ సినిమాల వరకు ఇలాంటి పోటీ ఎంత ఉన్నా ఓకే కానీ మధ్యలో డబ్బింగ్ చిత్రాలు కూడా దిగుతుండటంతో ఓపెనింగ్స్ విషయంలో టెన్షన్ తప్పేలా లేదు. దానికి ఏప్రిల్ 2 ఒక వేదికగా మారబోతోంది.

మంచి హైప్ ఉన్న రెండు సినిమాలు ఆ డేట్ లాక్ చేసుకున్నాయి. మొదటిది గోపిచంద్ సీటిమార్. సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి మణిశర్మ సంగీత దర్శకుడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న సీటిమార్ మీద అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అందులోనూ చాలా ఏళ్లుగా కనీసం యావరేజ్ హిట్ కూడా లేని గోపీచంద్ కు ఇది సక్సెస్ కావడం చాలా అవసరం. అందుకే కాంపిటేషన్ లేకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఏప్రిల్ 2కి ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా నిన్న సాయంత్రం సుల్తాన్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఇది కూడా అదే డేట్ కి వస్తోంది.

నిన్న టీజర్ చూశాక మాస్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తోంది. భీభత్సమైన ఫామ్ లో ఉన్న రష్మిక మందన్న హీరోయిన్ కావడం, కెజిఎఫ్ విలన్ ప్రధాన ఆకర్షణగా నిలవడం, బ్యాక్ డ్రాప్ కూడా మహాభారతం తరహాలో ఏదో రివెంజ్ డ్రామాలా ప్లాన్ చేయడం ఇదంతా చూస్తే కార్తీ ఈసారి కూడా ఖాకీ, ఖైదీ లాగే ఏదో డిఫరెంట్ సబ్జెక్టుతో వచ్చినట్టే కనిపిస్తోంది. సీటిమార్ క్రీడా నేపథ్యం కాబట్టి ఒకవేళ మాస్ ఫస్ట్ ఛాయస్ కనక సుల్తాన్ ని పెట్టుకుంటే కొంచెం ఇబ్బందే. ఖైదీ దెబ్బకు కార్తీకి ఇక్కడ మునుపటి ఇమేజ్ మళ్ళీ వచ్చేసింది. సో సీటిమార్ కు సుల్తాన్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయమే.

Show comments