వీడియో: విశాఖలో మద్యం సేవించి.. పోలీసులకు చుక్కలు చూపించిన మహిళ

మహిళా అభివృద్ధి, మహిళా సాధికారిత అంటూ పరుగులు పెడుతున్న ఆడవాళ్లు.. ఆధునిక పోకడలకు అలవాటు పడుతున్నారు. మగవాళ్లతో సమానంగా సంపాదిస్తున్నాం.. ఏ విషయంలోనూ వాళ్లకు తీసిపోం అని నిరూపించేందుకు కంకణం కట్టుకున్నారు కానీ.. మద్యం బాబులకు ఏ మాత్రం..

మహిళా అభివృద్ధి, మహిళా సాధికారిత అంటూ పరుగులు పెడుతున్న ఆడవాళ్లు.. ఆధునిక పోకడలకు అలవాటు పడుతున్నారు. మగవాళ్లతో సమానంగా సంపాదిస్తున్నాం.. ఏ విషయంలోనూ వాళ్లకు తీసిపోం అని నిరూపించేందుకు కంకణం కట్టుకున్నారు కానీ.. మద్యం బాబులకు ఏ మాత్రం..

మహిళలు అభివృద్ది చెందారు, సాధికారికత వైపు అడుగులు వేస్తున్నారు అంటూంటే ఏంటో అనుకున్నాం కానీ.. ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోయే మేడమ్ గురించి తెలిస్తే.. నిజమేనని అనకుండా ఉండరు. మగవారితో సమానంగా ఆడవాళ్లు ప్రతి విషయంలో పోటీ పడుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకు ఈ సంఘటనే నిదర్శనం. ఇంతకు ఆ మహిళ ఏం చేసిందనే కదా.. ఇంకేముందండి.. మందు బాబులకు ఏ మాత్రం తీసిపోకుండా.. ఫూటుగా మద్యం సేవించి.. సక్కంగా డ్రైవింగ్ చేసుకుని ఇంటికి వెళ్లిపోతుంది. మరీ పోలీసు బాబాయిలకు ఆమె మీద ఎందుకు డౌట్ వచ్చిందో తెలియదు కానీ.. ఆ మహిళను టెస్ట్ చేసేందుకు పిలిచారు.

అర్రె నన్నే టెస్టుకు పిలుస్తారా అంటూ.. రోడ్డుపై వీరంగం సృష్టించింది. బ్రెత్ ఎనలైజర్ టెస్ట్ కోసం గాలి ఊదమంటే.. నేను ఊదనూ అంటూ పోలీసులకే చుక్కలు చూపించింది. చివరకు మహిళా పోలీసులు, స్థానికుల సహకారంతో టెస్ట్ చేయగా.. 200 పాయింట్లు చూపించింది. తాగినట్లు నిర్ధారణ అయ్యింది. ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన విశాఖ పట్నంలో జరిగింది. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఓ మహిళా ఫుల్‌గా మద్యం సేవించి.. ద్వి చక్ర వాహనంపై ఇంటికి వెళ్లిపోతుంది. మార్గమధ్యంలో పోలీసులు.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు.

ఆ సమయంలో అటుగా వెళుతున్న మహిళ వాహనం ఆపి.. బ్రెత్ ఎనలైజర్ టెస్ట్ చేయాలని పిలిచారు. దీంతో సదరు మహిళ నేనేమన్నా తాగానా అంటూ చిందులు తొక్కింది. పోలీసులకు అడ్డు తిరిగింది. నేను తాగలేదంటూ.. .నేనేందుకు ఊదాలంటూ ఖాకీలతోనే వాదులాటకు దిగింది. అంతలో మహిళా పోలీసు, స్థానికుల సహకారంతో ఆమెకు పరీక్ష చేపట్టగా.. 200 పాయింట్లు దర్శనమిచ్చాయి. దీంతో సదరు మహిళపై కేసు నమోదు చేశారు. ఇటీవల కాలంలో మోడ్రన్ అమ్మాయిలే కాదూ.. మహిళలు కూడా మద్యం సేవించి.. పోలీసులకు పట్టుబడిన సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చిన సంగతి విదితమే. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments