Heart Attack: స్కూల్‌కి వెళ్లేందుకు రెడీ అవుతుండగా.. 8వ తరగతి విద్యార్థినికి గుండెపోటు

స్కూల్‌కి వెళ్లేందుకు రెడీ అవుతుండగా.. 8వ తరగతి విద్యార్థినికి గుండెపోటు

ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ.. నిండా 30, 40 ఏళ్లు కూడా నిండని యువకులు గుండె పోటుతో కన్నుమూస్తున్నారు. వీళ్లే కాదూ ఆడుతూ పాడుతూ కళ్లముందే తిరుగుతున్న చిన్నారులను సైతం బలి తీసుకుంటుంది హార్ట్ ఎటాక్.

ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ.. నిండా 30, 40 ఏళ్లు కూడా నిండని యువకులు గుండె పోటుతో కన్నుమూస్తున్నారు. వీళ్లే కాదూ ఆడుతూ పాడుతూ కళ్లముందే తిరుగుతున్న చిన్నారులను సైతం బలి తీసుకుంటుంది హార్ట్ ఎటాక్.

గుప్పెడంత గుండె చటుక్కున చంపేస్తుంది. గతంలో 60 ఏళ్లకు పైబడిన వారికి గుండెపోటు వచ్చేది. కానీ కరోనా అనంతరం.. ఆరోగ్య పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నేడు పసి బిడ్డలను కూడా హార్ట్ ఎటాక్ వదలడం లేదు. ఆడుతూ పాడుతూ సాగిపోతున్న పిల్లలకు, యువతీ యువలకు కూడా స్ట్రోక్ వస్తుంది. ఉన్నపళంగా దాడి చేస్తూ.. కోలుకోనివ్వకుండా చావు దెబ్బ కొడుతోంది. ఈ నేపథ్యంలోనే ఐసీఎంఆర్, ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దని చెబుతోంది. ముఖ్యంగా కఠిన వ్యాయామాలు, ఒళ్లు అలిసేలా శ్రమ, ఒత్తిడి, డ్యాన్సులు వంటివి చేయవద్దని చెబుతోంది.

ఇటీవల కాలంలో స్కూల్ చిన్నారులు గుండె పోటుతో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక పాఠశాలకు వెళుతూ గుండె పోటుతో మరణించింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా జోగణ్ణనకెరె గ్రామానికి చెందిన 13 ఏళ్ల సృష్టి బుధవారం పొద్దున్నే పాఠశాలకు వెళ్లేందుకు రెడీ అవుతుంది. అయితే ఇంతలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే సృష్టిని మూడిగెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే కన్నుమూసింది. విగత జీవిగా పడి ఉన్న బిడ్డను చూసి ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యారు తల్లిదండ్రులు. అప్పటి వరకు తమతో ముచ్చట్లు చెప్పిన బాలిక.. చిన్న వయస్సులోనే చనిపోవడంతో విషాద ఛాయలు అలముకున్నాయి.

గుండె పోటుతో సినీ సెలబ్రిటీలు కూడా మరణించిన సంగతి విదితమే. మొన్న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మొదలుకుని, నిన్న మలయాళ వర్ధమాన నటి లక్ష్మిక సజీవన్ వరకు అనేక మంది స్టార్స్ హార్ట్ ఎటాక్ కారణంగా మరణించాడు. మన తెలుగు నాట తారకరత్న 40 ఏళ్లు నిండకుండానే మృతి చెందిన సంగతి విదితమే. ఆ సమయంలో ఎంతో మంది శోక సంద్రంలో మునిగిపోయారు. యంగ్ నటులు, చిన్నారులు, రాజకీయ నేతలు, క్రీడాకారులు ఇలా ఒకరేమిటీ.. అనేక మంది గుండె పోటు బలి తీసుకుంటుంది. చిన్న వయస్సులోనే గుండె పోటుతో మరణించడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments