వీడియో : ఇదెక్కడి విడ్డూరం.. బోరు కొడితే నీళ్లకు బదులు పాలు వస్తున్నాయి!

వీడియో : ఇదెక్కడి విడ్డూరం.. బోరు కొడితే నీళ్లకు బదులు పాలు వస్తున్నాయి!

ఒకప్పుడు దేశంలో ప్రధాన వీధుల్లో బోర్ (చేతి పంపులు) దర్శనమిచ్చేవి. కాలం మారుతున్న కొద్ది ఇంటింటికి నల్లాలు రావడంతో చేతి పంపు వాడకం చాలా వరకు తగ్గింది. చేతి పంపులు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి.

ఒకప్పుడు దేశంలో ప్రధాన వీధుల్లో బోర్ (చేతి పంపులు) దర్శనమిచ్చేవి. కాలం మారుతున్న కొద్ది ఇంటింటికి నల్లాలు రావడంతో చేతి పంపు వాడకం చాలా వరకు తగ్గింది. చేతి పంపులు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి.

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చిత్ర విచిత్రమై వీడియోలో దర్శనమిస్తున్నాయి. కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తే.. కొన్ని భయపెట్టే విధంగా ఉంటున్నాయి. మరికొన్ని వీడియోలు నమ్మశక్యం కాని వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భూమిపై ఇప్పటి వరకు ఎన్నో విచిత్రాలు జరిగాయి.. అలాంటి ఓ విచిత్రానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాల చక్కర్లు కొడుతుంది. ఇంతకీ విచిత్రం ఏంటీ? ఎందుకు అంతలా వైరల్ అవుతుందో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఒకప్పుడు నీటి కోసం బావులు ఉపయోగించేవారు.. తర్వాత చేతి పంపులు వాడటం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఇంటింటికి నల్లాలు వచ్చాయి. ప్రస్తుతం కరెంట్ బోర్ లు ఎక్కువ అయ్యాయి. అయితే భూమిలోని స్వరూపాన్ని బట్టి చేతి పంపు నీళ్లు కొన్ని చోట్ల ఉప్పుగా, తియ్యగా ఉండటం తెలిసిందే.  దేశ వ్యాప్తంగా బోరింగ్ (చేతి పంపు) లు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఓ చేతి పంపు నుంచి నీటికి బదులు పాలు రావడంతో ఆ విచిత్రాన్ని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తూ.. బాటిళ్లు, బిందెలు, కవర్లలో నింపుకొని మరీ వెళ్తున్నారు. వినడానికి, చూడటానికి ఇది విడ్డూరంగా ఉన్నా.. ఉత్తర్ ప్రదేశ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఉత్తర్ ప్రదేశ్ లోని మొరదాబాద్ లో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చేతి పంపు నుంచి నీళ్లకు బదులు పాల మాధిరిగా తెల్లని నీళ్లు రావడం మొదలయ్యాయి. ఈ వార్త కాస్త చుట్టుపక్కల వ్యాపించడంతో ఇది దేవుడి మహిమ.. అందుకే నీళ్లకు బదులు పాలు వస్తున్నాయి అంటూ ప్రచారం మొదలైంది. అచ్చం పాలలాగే ఉన్న ఆ ద్రవాన్ని చూసి ప్రలు బిందెలు, నీళ్లబాటిల్స్ లో తీసుకొని వెళ్లారు. వాస్తవానికి అవి పాలు కాదని, భూమి స్వరూపాన్ని బట్టి నీళ్లు తెల్లని రంగులో వస్తున్నాయని కొంతమంది స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

Show comments