Krishna Kowshik
పిచ్చి పలు విధాలు అన్నట్లుగా మారిపోయింది నేటి యుగం. సోషల్ మీడియా స్టార్లుగా ఎదిగేందుకు.. నేమ్.. ఫేమ్ ఒక్కసారిగా వచ్చేయాలని అత్యాశతో.. పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిగో ఇప్పుడు మనం ప్రస్తావించబోతున్న మహిళ కూడా..
పిచ్చి పలు విధాలు అన్నట్లుగా మారిపోయింది నేటి యుగం. సోషల్ మీడియా స్టార్లుగా ఎదిగేందుకు.. నేమ్.. ఫేమ్ ఒక్కసారిగా వచ్చేయాలని అత్యాశతో.. పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిగో ఇప్పుడు మనం ప్రస్తావించబోతున్న మహిళ కూడా..
Krishna Kowshik
ఓవర్ నైట్ స్టార్ అయిపోయేందుకు ఇప్పుడు వినియోగిస్తున్న పదునైన ఆయుధం సోషల్ మీడియా. ఇందులో ఎప్పుడు ఏ వీడియో హైలెట్ అవుతుందో.. ట్రెండ్ సెట్ చేస్తుందో చెప్పడం కష్టం. ఫేమ్, నేమ్ తెచ్చుకునేందుకు సామాజిక మాధ్యమాలను యూజ్ చేస్తున్నారు చాలా మంది. రీల్స్, షార్ట్స్ అంటూ పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ పేరు తెచ్చుకున్న వాళ్లున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి వెకిలి చేష్టలు చాలా ఎక్కువయ్యాయి. అమ్మాయిని బైక్ ఎదురు కూర్చొబెట్టుకుని రొమాన్స్ తో కూడిన స్టంట్స్ చేయడం, మెట్రో రైళ్లల్లో సరసాల్లో మునిగిపోవడం, రోడ్లపై గెంతులేస్తూ వీడియోలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఇవి చూసేందుకు కూడా చిరాకు తెప్పిస్తుంటాయి.
ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో కూడా అలాంటిదే. ఆ వీడియోలో ఓ మహిళ.. ఒక బండిపై వెనుక వైపు రివర్స్ లో కూర్చుని.. అటుగా వస్తున్న బైకర్ కు ప్లయింగ్ కిస్సులు ఇవ్వడం కనిపిస్తోంది. తిరిగి అతడు కూడా ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు. అంతేనా తన బండి వెనుక సీట్లోకి రావాలని ప్రపోజ్ చేయగా.. నో చెప్పింది అమ్మడు. అతడు వెళ్లిపోయాక కూడా ముద్దులు ఇస్తూనే ఉంది. అంతే కాకుండా రోడ్డుపై వయ్యారాలు ఒలకబోస్తుంది. అది కూడా చల్లటి చలిలో. పొగమంచు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇది ట్రెండ్ అయ్యేందుకు చేసిన వీడియో అని స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఆ బైక్ కు నంబర్ ప్లేట్ లేదు. బండి నడుపుతున్న వ్యక్తి కూడా కనిపించకుండా కవర్ చేసిందా మహిళ.
చీర కట్టుల్లో నడుమందాలు ఒలకబోస్తూ రోడ్డుపైనే ముద్దుల వర్షం కురిపించింది ఈ అమ్మడు. ఇందులో మరో విశేషమేమిటంటే.. ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన అబ్బాయి బండికి కూడా నంబర్ ప్లేట్ లేకపోవడం. ఇద్దరు బైకర్లు.. హెల్మెట్లు ధరించకుండానే వాహనాన్ని నడుపుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి ఆపాలని కొంత మంది మండిపడుతున్నారు. రోడ్డుపై ఇలాంటి చెత్త సైగలు చేస్తున్నందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని, ఆమె బండికి చలానా జారీ చేయాలంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఫేమ్ అవ్వడం కోసం మహిళ ఇలా చేయడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
इतनी ठंड में बिना स्वेटर के ये औरत बाइक पर बैठ कर अजीब हरकत कर रही 🥶😱 pic.twitter.com/Bp1X4k4YJs
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) December 30, 2023