Arjun Suravaram
KS Chithra: జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడు ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ వేడుక నేపథ్యంలో ప్రముఖ సినీ గాయని కె.ఎస్.చిత్ర ఓ వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఆ వీడియో సందేశం రచ్చ చేస్తోంది.
KS Chithra: జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడు ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ వేడుక నేపథ్యంలో ప్రముఖ సినీ గాయని కె.ఎస్.చిత్ర ఓ వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఆ వీడియో సందేశం రచ్చ చేస్తోంది.
Arjun Suravaram
దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. త్రేతాయుగంలో రాములోరి పట్టాభిషేకం జరిగిన తీరులో.. నేటి కలియుగంలో మరోసారి ఆ రామయ్య అయోధ్యలో కొలువు దీరనున్నాడు. ఈ మహత్తర కార్యాన్ని వేలాది మంది ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తున్నారు. అంతేకాక లక్షలాది మంది రామ భక్తులు అయోధ్యకు తరలి వస్తున్నారు. మొత్తంగా అయోధ్య నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు అయోధ్యకు సంబంధించి సందేశాలు ఇస్తున్నారు. అలానే ప్రముఖ గాయని చిత్ర కూడా రామాలయంపై ట్వీట్ చేశారు. ఆ న్యూస్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. మరి..ఆ స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
కె.ఎస్. చిత్ర.. ఈ పేరు తెలియని సినీ ప్రియులు ఉండరు. ఎన్నో అద్భుతమైన పాటలకు తన గాత్రం అందించారు. సంగీతానికి భాష ముఖ్యం కాదు భావమే ముఖ్యం అంటూ భారతీయ చలన చిత్ర పరిశ్రమకు తన గాత్రంతో నవరసాల్ని పరిచయం చేశారు. తనకున్న గాన నైపుణ్యంతో ఎంతో మంది దిగ్గజ సింగర్స్ తో గొంతు కలిపారు. ఆమె అనేక భాషల్లో దాదాపు 25 వేలకు పైగా పాటలు పాడారు. సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ లోనూ తన పాటలతో సంగీత ప్రియుల మనస్సులో స్థానం పొందారు. ఇక అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం వేళ చిత్ర ఓ సందేశం విడుదల చేశారు.
అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమ సమయంలో ప్రజలు రాముడి శ్లోకాలు జపించాలని ఆ సందేశంలో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా చిత్ర ఆ వీడియో పోస్టు చేశారు. ప్రతీ ఒక్కరూ పవిత్ర కార్యక్రమం జరిగేటప్పుడు మధ్యాహ్నం 12.20 గంటలకు ‘శ్రీరామ జయ రామ జయ జయ రామ’ మంత్రాన్ని జపించండి. అదే రోజు సాయంత్రం ప్రజలు తమ ఇళ్లలో ఐదు వత్తుల దీపాలను వెలిగించండి. ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖినోభవంతు’ అంటూ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది.
ఓ వర్గం నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చర్యల్ని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి సందేశాలు ఇవ్వడం ద్వారా ఆమె రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఆమెకు మద్దతుగా మరో గాయకడు వేణుగోపాల్ నిలబడ్డారు. అలానే మరో వర్గం కూడా చిత్రకు మద్దతుగా నిలిచింది. ఆమె తన భావాలను వ్యక్తీకరించే హక్కు, స్వేచ్ఛ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఇలాగే త్రిసూర్‌లో బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో నటి శోభన ప్రధాని నరేంద్ర మోడీతో వేదిక పంచుకోవడాన్ని కూడా ఒక వర్గం ప్రజలు తీవ్రంగా విమర్శించారు. మొత్తంగా సోషల్ మీడియా వేదికగా గాయని చిత్ర పోస్టు రచ్చ జరుగుతోంది.
ఇక అయోధ్య రామమందిర బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అలానే అయోధ్య నగరం మొత్తం కాషాయంతో నిండిపోయింది. ప్రస్తుత అయోధ్య నగరం.. త్రేతాయుగంలోని అయోధ్యలా మారిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాములోరి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అంతేకాక ఈ కార్యక్రమానికి, దేశవ్యాప్తంగా 7000 మంది ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది. ఈ బృహత్తర వేడుకతో అయోధ్యలో పూర్తిగా పండుగ వాతావరణం ఏర్పడింది. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అయోధ్య వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. మరి.. గాయని చిత్ర అంశంలో సోషల్ మీడియాలో జరుగుతున్న వార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Singer @KSChithra, also known as ‘Nightingale of the South’, faces stark criticism on her Ramlala consecration ceremony post on social media.
She had advised everyone to chant Shri Ram’s name during the ceremony.
👉 Chithra hails from #Kerala, the way #Communists oppose… pic.twitter.com/bZ5LxWHUt2
— Sanatan Prabhat (@SanatanPrabhat) January 16, 2024